Sunday, March 22, 2026 07:24 AM
Sunday, March 22, 2026 07:24 AM

అఖండ 2 ప్రీమియర్స్ రద్దు : కారణం అదేనా..?

నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఇవాళ పెద్ద షాక్ తగిలింది. ఎంతోకాలంగా ఎదురుచూసిన ‘అఖండ 2’ ప్రీమియర్లు చివరి నిమిషంలో రద్దయ్యాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక ప్రీమియర్ షోల కోసం టికెట్ రేట్లు పెంచుతూ జీవోలు జారీ చేసినప్పటికీ.. ప్రీమియర్లు జరగకపోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. దీనికి కారణం 14 రీల్స్ ప్లస్ సంస్థకు గత సినిమాల వల్ల పేరుకుపోయిన భారీ బకాయిలు కావడం తెలిసింది.

Also read : పవన్ పై కవిత సంచలన కామెంట్స్..!

నిర్మాతలపై దాదాపు ₹30 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కారణంగా ఫైనాన్షియర్లు సినిమా విడుదలను అడ్డుకుంటారనే ప్రచారం గత కొన్ని రోజులుగా సాగుతోంది. కానీ “₹30 కోట్లు పెద్ద మొత్తం కాదు, నిర్మాతలు క్లియర్ చేస్తారు” అని అభిమానులు, పరిశ్రమ వర్గాలు నమ్ముతూ వచ్చారు. రామ్ ఆచంట, గోపీ ఆచంటలు కూడా అఖండ 2 ఫైనాన్స్ సమస్యను చివరి నిమిషం వరకు పరిష్కరించడానికి తీవ్రంగా ప్రయత్నించినా.. అది సాధ్యం కాలేదని సమాచారం. దీంతో చిత్రబృందం అధికారికంగా ప్రీమియర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇప్పటికే ఏపీలో ప్రీమియర్ షోల కోసం అమ్మిన టికెట్ల మొత్తాన్ని ప్రేక్షకులకు తిరిగి ఇవ్వనున్నారు. తెలంగాణలో బుకింగ్స్ ఓపెన్ కాకపోవడంతో అక్కడ పెద్ద సమస్య ఏమీ లేదు. అయితే ప్రీమియర్ షోల ద్వారా వచ్చే భారీ ఆదాయం కోల్పోవడం సినిమాకు ఆర్ధికంగా గట్టి దెబ్బ అని స్పష్టమవుతోంది. ఇప్పుడు అందరి ప్రశ్న ఒక్కటే… రేపు సినిమా నిజంగా విడుదల అవుతుందా? తెల్లవారుజాము వరకు ఈ చర్చ, చర్చలే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు క్లియరెన్స్ వస్తే విడుదల సజావుగానే సాగవచ్చు. అయితే విదేశాల్లో ప్రీమియర్లు యథావిధిగా కొనసాగుతాయని నిర్మాతలు ప్రకటించారు. అయితే విదేశాల్లో విడదల అయ్యి.. మన దేశంలో సమస్య పరిష్కారం అవ్వక సినిమా విడుదల కాకపోతే కలెక్షన్ల పై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. మరి నిర్మాతలు ఏమి చేస్తారో చూడాలి.

Also read : బాలు విగ్రహం చుట్టూ రాజకీయం..!

ఏదేమయినా ఒక పెద్ద సినిమా విడుదలకు ఒకరోజు ముందు ఇటువంటి పరిస్థితులు రావడం చాలా అరుదు.  ‘అఖండ 2’ విషయంలో అనుకోని ఈ అవాంతరంతో బాలయ్య అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. మరి దీని పై అఖండ2 టీం ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్