Friday, September 12, 2025 06:40 PM
Friday, September 12, 2025 06:40 PM
roots

పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో అఖండ సీక్వెల్

టాలీవుడ్ లో నందమూరి నట సింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో అంటే జనాలలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా ప్రకటన నుంచి విడుదల వరకు ప్రజలు, అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. టాలీవుడ్ లో మరే డైరెక్టర్, హీరోకి లేని క్రేజ్ ఇది. ఇప్పటి వరకు మూడు సినిమాలు రాగా, మూడు సినిమాలు ఫ్యాన్స్ కు మంచి జోష్ ఇస్తూ భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. బాలకృష్ణను ఏ రేంజ్ లో చూపిస్తే ఫ్యాన్స్ కి మతి పోతుందో, ఆ రేంజ్ లో చూపించడం బోయపాటి స్టైల్. అసలు బాలయ్య కెరీర్ లో ఏ డైరెక్టర్ కూడా బాలయ్యను ఆ రేంజ్ లో చూపించలేదు.

అందుకే బోయపాటితో బాలయ్య సినిమా అంటే… ఫ్యాన్స్ కు హిట్ అనే ధీమా ఉంటుంది. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరో సినిమా రానుంది. నాలుగో సినిమా చేస్తున్నామని దసరా సందర్భంగా ప్రకటించి వారం తిరగకముందే కొబ్బరి కాయ కొట్టింది చిత్ర యూనిట్. త్వరలోనే ఈ సినిమా పూర్తి స్థాయి షూటింగ్ కూడా మొదలుకానుంది. బాబీతో బాలయ్య చేస్తున్న సినిమా దాదాపుగా పూర్తయింది. అందుకే బాలయ్య వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఇక ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది అంటున్నారు సినీ జనాలు.

Also read : భగవంత్ కేసరి రీమేక్ చేయాలంటున్న తమిళ స్టార్ హీరో

మొదటి పార్ట్ లో సుబ్బరాజు ఎంపీ పదవిలో ఉండి బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోతాడు. ఆ ఎంపీ పదవిని బాలయ్య ఏకగ్రీవంగా చేపడతాడట. ఇలా రెండు పాత్రలకు న్యాయం చేసే దిశగా సినిమాను బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు. విలన్ గా బాబీ డియోల్ ని దాదాపుగా ఫైనల్ చేయగా… ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ కూడా ఉండనుంది అని టాక్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో దేవాలయాల కోసం, ప్రకృతి కోసం ఎంపీ నిలబడటం ప్రధానంగా చూపించనున్నారట. అలాగే ఏపీలో గత అయిదేళ్ళుగా దేవాలయలపై జరిగిన దాడులను ఈ సినిమాలో చూపించే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా అంతర్వేది రథం, ఉత్తరాంధ్రలో రాముడి విగ్రహం తల ద్వంశం ఘటనలు చూపించే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్