Sunday, March 22, 2026 08:50 AM
Sunday, March 22, 2026 08:50 AM

ఛీ ఛీ.. అలాంటి సినిమాలకు అవార్డులా..

ప్రస్తుత సినిమాలపై ప్రముఖ మళయాళ దర్శకులు అడూర్ గోపాల కృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ చలనచిత్ర పురస్కారాల ఎంపినను తీవ్రంగా తప్పుబట్టారు. చెత్త సినిమాలకు, చెడు ప్రభావం కలిగించే సినిమాలకు జాతీయ పురస్కారాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఏ ప్రాతిపదికన జాతీయ పురస్కారాలకు సినిమాలను జ్యూరీ ఎంపిక చేస్తుందో తెలియటం లేదన్నారు.

కేరళకు చెందిన అడూర్ గోపాలకృష్ణన్ ఇప్పటికే 16 సార్లు జాతీయ పురస్కారం, 17 సార్లు కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. 1984లోనే పద్మ శ్రీ అవార్డు అందుకు్న గోపాల కృష్ణన్.. 2006లో పద్మ విభూషణ్‌తో కేంద్రం సత్కరించింది. 2004లో భారతీయ సినిమాలో అత్యున్నతమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అడూర్ గోపాలకృష్ణన్ అందుకున్నారు.

Also Read : ఏపీ అభివృద్ధికి కొత్త ఫార్ములా..చంద్రబాబు 3 జోన్ పాలసీ..!!

జాతీయ చలన చిత్ర పురస్కారాలై గోపాల కృష్ణన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. కొన్నేళ్లుగా చెడు, చెత్త సినిమాలకు జాతీయ పురస్కారాలు ఇస్తున్నారని.. ఇది ఎలా జరుగుతుందో పరిశోధించాలని గోపాల కృష్ణన్ వ్యాఖ్యానించారు. నిజానికి జాతీయ పురస్కారాల ఎంపికకు స్పష్టమైన సూచనలు పాటించాల్సి ఉందన్నారు గోపాల కృష్ణన్. నాణ్యమైన సినిమాలను గురించటం, సమాజానికి మేలు చేసే సినిమాలను ప్రొత్సహించే ఉద్దేశంతోనే జాతీయ పురస్కారాల ఎంపిక జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం.. ఎంపిక అలా జరగటం లేదన్నారు.

జ్యూరీ నాణ్యత తక్కువగా ఉంటే.. చెడు సినిమాలు ఎంపిక అవుతాయన్న గోపాల కృష్ణన్.. సరైన సినిమాకు గౌరవం దక్కాలంటే.. అర్హమైన జ్యూరీ ఉండాలన్నారు. ప్రస్తుతం జ్యూరీ సభ్యుల్లో సరైన అర్హత ఉన్న వారే లేరని గోపాల కృష్ణన్ పరోక్షంగా ఆరోపించారు. జాతీయ పురస్కారాల వ్యవస్థను పూర్తిగా ఆపేస్తే మంచిందని సూచించారు. నిజానికి ఇలాంటి విమర్శలు గోపాల కృష్ణన్ 2022లో కూడా చేశారు. కనీసం సినిమా పూర్తిగా చూడకుండానే జ్యూరీ సభ్యులు పురస్కారాలు ఇస్తున్నారని ఆరోపించారు. పురస్కారాల ఎంపికలో సిఫార్సులు ఎక్కువగా ఉన్నాయనే అనుమానం అప్పట్లోనే వ్యక్తం చేశారు.

Also Read : ఐపీఎస్ సునీల్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమా..!

2019లో ‘బాహుబలి’ వంటి సినిమాలు పురస్కారాలు గెలవడాన్ని ఆయన విమర్శించారు. ఇక 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ది కేరళ స్టోరీ సినిమాకు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డులు ఇవ్వటంపై ఇప్పటికే పలువురు విమర్శలు చేస్తున్నారు. ది కేరళ స్టోరీకి అవార్డులు ఇవ్వటం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని బహిరంగంగానే ఆరోపించారు. ది కేరళ స్టోరీ లోని వివాదాస్పద అంశాల కారణంగా జ్యూరీ నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తాయి. ప్రకాశ్ రాజ్, ఉర్వశి వంటి నటులు కూడా జ్యూరీ నిర్ణయాల్ని విమర్శించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్