Friday, September 12, 2025 07:25 PM
Friday, September 12, 2025 07:25 PM
roots

రజనీ కేసులపై ఏసీబీ కీలక నిర్ణయం…!

ఏపీలో వైసిపి నేతల అవినీతి, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు చేసిన నాయకులను జైలుకు పంపించేందుకు సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడుదల రజినిపై గట్టిగానే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో పాటుగా పల్నాడు జిల్లాలో ఆమె చేసిన అవినీతి అక్రమాల విషయంలో చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.

Also Read :అమ్మో వారెంట్.. వైసీపీ నేతల గుండెల్లో రైళ్ళు

ఇందుకోసం పూర్తిస్థాయిలో చట్టబద్ధంగా వ్యవహరిస్తుంది. మాజీ మంత్రి కావడం తో గవర్నర్ అనుమతి తప్పనిసరిగా మారింది. ఇప్పటికే ఆమె వ్యవహారాలకు సంబంధించి అన్ని ఆధారాలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతిని ఏసీబీ అధికారులు తీసుకున్నారు. ఇప్పుడు గవర్నర్ అనుమతి కోసం కూడా లేఖ సమర్పించారు. విడుదల రజనీపై చేసిన ప్రాథమిక దర్యాప్తు ఆధారాలను కూడా రాజ్ భవన్ కు ఏసీబీ సమర్పించినట్లు సమాచారం.

Also Read : దువ్వాడను ఎత్తడమే లేట్.. షాక్ ఇచ్చిన జనసేన…!

ఓ స్టోన్ క్రషర్ యజమానికి 50 కోట్లు ఫైన్ వేసి ఐదు కోట్లు కడితేనే వ్యాపారం చేయగలరని బెదిరించినట్లు పోలీసులకు సాక్షాలు అందాయి. అప్పట్లో పోలీసులను కూడా పంపి ఆమె బెదిరించినట్లు పోలీసులు సాక్షాలు సేకరించారు. చివరికి రెండున్నర కోట్లకు బేరం కుదుర్చుకున్నారని.. ఇలా వందల మంది దగ్గర వసూలు చేయడంతో వాళ్లందరూ పోలీసులకు ఫిర్యాదు చేసారు. గవర్నర్ అనుమతి రాగానే.. విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. చిలకలూరిపేటలో ఆమె చేసిన అక్రమాల కారణంగా ఓడిపోవడం ఖాయం అనే అభిప్రాయానికి వైసీపీ అధిష్టానం రావడంతో ఆమెకు గుంటూరు నుంచి సీటు ఇచ్చారు. అటు ఆమె మరిదిపై కూడా పలు కేసులు నమోదు అవుతున్నట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్