Sunday, March 22, 2026 01:14 PM
Sunday, March 22, 2026 01:14 PM

ఎటు పోతోంది ఈ సమాజం.. ఇంత దారుణమా..!

రోడ్డు మీద పోతుంటే.. ఎవరో ఒకరు అడ్డం వస్తూనే ఉంటారు. ఇంకా చెప్పాలంటే.. భారత్‌ లాంటి బిజీ రూడ్లపైన ఇది సర్వ సాధారణం. ఇక ట్రాఫిక్‌లో ఆగినప్పుడు పక్క నుంచో, వెనక నుంచో ఎవరో ఒకరు తగులుతూనే ఉంటారు. ఎంత ఖరీదైన వాహనం అయినా సరే.. చిన్న గీత అయినా పడాల్సిందే. కారు వల్ల అయినా సరే.. పక్క నుంచి వెళ్లే వారి వల్ల అయినా సరే.. గీత కామన్. కానీ ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ ఘటన ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తోంది.

Also Read : జయలలితను గుర్తు చేస్తున్న కవిత.. న్యూ పొలిటికల్ లుక్

బెంగళూరులో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాలు తీసి అడుగు ముందుకు వేయడానికి కూడా సాధ్యం కాదు. ఇక రహదారులపై గుంతల కారణంగా.. పక్కనే ఉన్న వాహనానికి తగలకుండా ప్రయాణం చేయడం అసాధ్యం. ఇలాంటి రోడ్లపై ప్రయాణం చేస్తున్న సమయంలో చిన్ని చిన్న గీతలు సర్వ సాధారణం. అలా వెళ్తున్న సమయంలో కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తగిలిందనే కోపంతో.. ఆ బైకర్‌ను కారుతో గుద్ది చంపేశారు. ఈ ఘటన ఇప్పుడు బెంగళూరులోనే కాకుండా దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఈ నెల 22వ తేదీన దర్శన్ అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి బైక్ పైన వెళ్తున్న సమయంలో ముందుగా వెళ్తున్న కారు పక్కనుంచి వెళ్తుండగా.. దాని సైడు మిర్రర్‌కు బైక్ తగిలింది. దీంతో కారులో ఉన్న మనోజ్ కుమార్, అతని భార్య ఆరతి శర్మ బైక్ పైన వెళ్తున్న దర్శన్‌తో గొడవపడ్డారు. పక్కనే ఉన్న వాళ్లు సర్ది చెప్పడంతో.. గొడవ సద్దుమణిగింది. అయితే దర్శన్ తమను దూషించాడనే అక్కసుతో 2 కిలోమీటర్ల దూరం బైక్‌ను వెంబడించి మనోజ్ కుమార్.. వెనక నుంచి బైకును ఢీ కొట్టి వెళ్లిపోయారు.

Also Read : కన్నీరు పెట్టిస్తున్న రైతన్నల వీడియోలు.. నిండా ముంచిన తుఫాన్

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దర్శన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దర్శన్‌తో పాటు ఉన్న వరుణ్ చెప్పిన వివరాల మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అసలు విషయం బయటపెట్టారు. ప్రమాదం జరిగిన తర్వాత ఘటనా స్థలంలో కారు విడి భాగాలు కొన్ని పడిపోయాయి. వాటి కోసం తిరిగి వచ్చిన మనోజ్, ఆరతి.. మాస్క్ వేసుకుని వచ్చి వాటిని తీసుకెళ్లారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించిన పోలీసులు.. మనోజ్, ఆరతిలను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై స్థానికులు, సోషల్ మీడియా వేదికలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న కారణం కోసం ఒక యువకుడి ప్రాణం తీయడం దారుణమని విమర్శిస్తున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్