కాసేపట్లో కొడాలి నానీ ప్రెస్ మీట్, కాసేపట్లో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పెర్ని నానీ మీడియా సమావేశం, గుంటూరులో మీడియాతో మాట్లాడనున్న మంత్రి అనీల్ కుమార్ యాదవ్ గతంలో మీడియా గ్రూపుల్లో ఈ సందడి ఓ రేంజ్ లో ఉండేది. నోటికి పని చెప్పే నేతలు కావడంతో కెమెరాలకు మైకులకు మీడియా ప్రతినిధులు పని చెప్పే వాళ్ళు. ఇక ఆ బూతుల కోసం వైసీపీ సోషల్ మీడియా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేది. బొచ్చు, పీకడం, అమ్మలు మొగుళ్ళు అంటూ ఓ రేంజ్ లో ఉండేవి మీడియా సమావేశాలు.
కాని ఇప్పుడు మీడియా సమావేశాలు బోసిగా ఉంటున్నాయి. అదే లడ్డు కల్తీ చంద్రబాబు చేసాడు అని గనుక జగన్ నోటి నుంచి వచ్చి ఉంటే… మీడియా సమావేశాలు మోతమోగేవి. ఆ సందడే వేరే రేంజ్ లో ఉండేది. ఇప్పుడు మీడియా సమావేశాలు అన్నీ సప్పగా ఉంటున్నాయి. ఏది మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు కూటమి మంత్రులు. ఇక వైసీపీలో అప్పుడు సందడి చేసిన వాళ్ళు అందరూ తలో దారి వెళ్ళారు. ఎవరు ఎక్కడ ఉన్నారో జగన్ కు కూడా సమాచారం లేదు. కాని కేంద్ర కార్యాలయానికి రావాలని అన్న ఆదేశిస్తే ఫాలో అయిపోతున్నారు.
Read Also : సైలెంట్ మోడ్‌లో వైసీపీ నేతలు….!
ఇక వైసీపీ మీడియా సమావేశాలు అన్నీ కూడా కొందరి చుట్టూనే తిరుగుతున్నాయి. అప్పట్లో సకల శాఖల గురించి రివ్యూ చేసిన ఓ రెడ్డి గారు నన్ను అరెస్ట్ చేయొద్దు మహా ప్రభో అంటూ హైకోర్ట్ లో ముందస్తు బెయిల్ పిటీషన్ వేసారు. ఇక ఎటు తిరిగి విడదల రజనీ, అంబటి రాంబాబు మాత్రమే మీడియాతో మాట్లాడుతున్నారు. సిక్కోలు నుంచి చిత్తూరు వరకు అసలు మిగతా వైసీపీ నేతలు మాట్లాడే సాహసం కూడా చేయడం లేదు. అప్పుడప్పుడు నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశాలు ఉంటున్నాయి. మరి ఎప్పుడు మీడియా ముందుకు వస్తారో… అప్పుడప్పుడు జగన్ కన్నీళ్లు తుడవడానికి నానీ బ్రదర్స్ మాట్లాడుతున్నారంతే. కాని మేజర్ రోల్ మాత్రం రజనీ, రాంబాబులదే.