Friday, September 12, 2025 03:25 PM
Friday, September 12, 2025 03:25 PM
roots

బ్రేకింగ్: కొండా సురేఖ గారు అర్ధం చేసుకోండి: సమంతా

సమంతా నాగ చైతన్య విడాకుల విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ప్రమేయం ఉందంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలు కొందరు సినీ ప్రముఖులు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే అక్కినేని నాగార్జున కూడా రియాక్ట్ అయ్యారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. తాజాగా మంత్రి వ్యాఖ్యలపై సమంతా రియాక్ట్ అయ్యారు.

Read Also : సమంతా చేసుకున్న పుణ్యం ఏంటీ భువనేశ్వరి చేసిన పాపం ఏంటీ…?

నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని తాను కోరుతున్నట్టు ఓ ప్రకటన విడుదల చేసారు సమంతా. ఈ రోజుల్లో సినిమా పరిశ్రమలో మహిళలు నిలబడటం అనేది చాలా కష్టంగా ఉందని, వ్యక్తిగత జీవితాల్లో కూడా మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి…. చాలా ధైర్యం, బలం కావాలని పేర్కొంది సమంతా. కొండా సురేఖ గారూ, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నానని చెప్పిన సమంతా… దయచేసి చిన్నచూపు చూడకండని విజ్ఞప్తి చేసింది.

ఒక మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాని ఆ ప్రకటనలో సమంతా ప్రస్తావించింది. ఇక వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా వుండండని కోరింది. నా విడాకులు పరస్పర అంగీకారం మరియు సామరస్యపూర్వకంగా జరిగాయని స్పష్టం చేసింది సమంతా. ఎటువంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదని పేర్కొంది. దయచేసి తన పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరా? అంటూ విజ్ఞప్తి చేసింది సమంతా. తాను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటానన్న అలానే ఉండాలని కోరుకుంటున్నాని క్లారిటీ ఇచ్చింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్