Friday, September 12, 2025 03:24 PM
Friday, September 12, 2025 03:24 PM
roots

సమంతా చేసుకున్న పుణ్యం ఏంటీ భువనేశ్వరి చేసిన పాపం ఏంటీ…?

నదులు అన్నీ వెళ్లి సముద్రంలో కలిసినట్టు తెలుగు రాజకీయ నాయకులు అందరూ రొచ్చులోనే కలుస్తున్నారు. వీళ్ళను ఏమైనా అంటే అంతెత్తున లేచే నాయకులు… మహిళల వ్యక్తిగత విషయాల మీద ఉచ్చ నీచాలు మరిచి ఏ విధంగా మాట్లాడతారో మరి. తమవే కుటుంబాలు, తమవే జీవితాలు, తమవే కష్టాలు… తామే తామే… మరి ఇతరులు…? అసలు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నట్టు…? అప్పుడు నందమూరి, నారా కుటుంబాల్లోని మహిళలు అయినా, ఇప్పుడు సమంతా అయినా… వీళ్ళకు రాజకీయాలకు సంబంధం ఏంటీ…?

ఇక్కడ కొన్ని రాతలు రాయడానికి వేళ్ళు కూడా సిగ్గుపడుతున్నాయి గాని… రాజకీయ ప్రత్యర్ధులను ఎదుర్కొనే దమ్ము ఉంటేనే రాజకీయం చేయాలి, లేదా అన్నీ సర్దుకుని కాపురాలు చేయాలి తప్పించి వ్యక్తిగత జీవితాలతో రాజకీయ లబ్ది పొందాలి అనుకోవడం దరిద్రం, మహా పాపం. లోకేష్ పుట్టుక గురించి వైసీపీ సోషల్ మీడియా చేసిన తప్పుడు వ్యాఖ్యలు ఇప్పటికీ చాలా మంది ఉన్మాదులు డిలీట్ చేయలేదు. టీడీపీ దివంగత నాయకుడికి భువనేశ్వరికి అంటగట్టి లోకేష్ ఆయనకే పుట్టాడు, ఆయన పోలికలే అంటూ సాక్షాత్తు ప్రజా ప్రతినిధులు సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడారు. అది కూడా రాష్ట్ర అసెంబ్లీలో… ఒక రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి వేదిక అసెంబ్లీ.

ఇక దేవాన్ష్ పుట్టుక గురించి, బాలకృష్ణ కొడుకు పుట్టుక గురించి తప్పుడు కూతలు ఇప్పటికీ కూస్తూనే ఉన్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకి సమంతా వచ్చేసింది. సమంతా నాగ చైతన్య విడిపోవడానికి కారణం ఏదైనా ఉండవచ్చు. హీరోయిన్లు పెళ్లి చేసుకోవడానికి కారణం ఎవరైనా అయి ఉండవచ్చు. కాని పలానా నాయకుడు కారణం అని మంత్రి హోదాలో ఉన్న సురేఖ మాట్లాడటం ఒక ముక్కలో చెప్పాలంటే పరమ రోతగా ఉంది. ఇప్పుడు కొండా సురేఖ మాట్లాడింది తప్పు అంటూ కొందరు మానవతా వాదులు, మహిళా సంఘాల వాళ్ళు, లేదంటే సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు.

Read Also : వామ్మో… ఆయన ఇలాంటోడా…!

మహిళ కాబట్టి ఒక మనిషిగా మనం రియాక్ట్ కావడంలో తప్పు లేదు. కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా వారం రోజుల క్రితం మంత్రి కొండా సురేఖకు ఎంపీ రఘునందన్ రావుకు మధ్య కొత్త లింక్ పెట్టింది. నూలు పోగు వేయడాన్ని తప్పుగా చూపిస్తూ పోస్ట్ లు పెట్టింది. ఆ పోస్ట్ లను కేటిఆర్ గాని ఇతర బీఆర్ఎస్ నేతలు గాని ఖండించే ప్రయత్నం చేయకపోగా… ఇప్పుడు నీకు బాధ తెలుస్తుందా సురేఖ అంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యల తర్వాత సురేఖ నోటికి పని చెప్పారు. ఇక్కడ సురేఖ తప్పు ఎంత ఉందో కేటిఆర్ తప్పు అంతకు మించి ఉంది. తమ నాయకులను తమ సోషల్ మీడియాను అదుపులో ఉంచాల్సిన బాధ్యత కేటిఆర్ కు ఉంది. భవిష్యత్తు నాయకుడు కాబట్టి కేటిఆర్ జాగ్రత్తలు తీసుకోవాలి.

సీతక్క విషయంలో కూడా ఇలాగే మాట్లాడారు. గిరిజన మహిళ అని కూడా చూడకుండా రెచ్చిపోతూ ఉంటుంది బీఆర్ఎస్ సోషల్ మీడియా. వీటిని కట్టడి చేయాల్సిన బాధ్యత కేటిఆర్ కు ఉంది. ఇక తమపై చేసిన పోస్ట్ లకు గానూ రఘునందన్ రావు కోర్ట్ కి వెళ్తాను అన్నారు… ఇక్కడ మంత్రిగా భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సిన బాధ్యత సురేఖకు ఉంది. కాని సురేఖ పరిధి దాటి విమర్శలు చేసారు. దీనితో సామాజిక ఉద్యమ కారులు, సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ సురేఖను తప్పుబడుతున్నారు. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులను ఎందుకు తెస్తున్నారు అంటూ విమర్శించారు.

మరి ఇదే సామాజిక వేత్తలు, ఇదే లాయర్లు, ఇదే సినిమా ప్రముఖులు కొండా సురేఖపై చేసిన కామెంట్స్ గురించి ఎందుకు మాట్లాడలేదు…? సాక్షాత్తు కేటిఆర్, సీతక్క గురించి చేసిన కామెంట్స్ పై మాట్లాడలేదు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి పదే పదే పోస్ట్ లు పెట్టే… ప్రకాష్ రాజ్… సినిమా వాళ్ళతో సంబంధం లేని వ్యక్తులను ఎందుకు రాజకీయాల్లోకి తెస్తున్నారని గతంలో ఏపీ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై మాట్లాడలేదు. ఇప్పుడు స్పందిస్తున్న కొందరు లాయర్లు… గతంలో భువనేశ్వరి లక్ష్యంగా చేసిన కామెంట్స్ పై రియాక్ట్ కాలేదు.

అంటే ఇక్కడ భయపడింది ఎవరికి…? సమంతా మహిళే. భువనేశ్వరి, నారా బ్రాహ్మణి మహిళలే. ఈ జాలి అప్పుడు ఎందుకు చూపించలేదు…? అక్కినేని నాగార్జున వంటి వారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు…? అక్కినేని కుటుంబానికి నందమూరి కుటుంబానికి స్నేహం ఉంది. దూరపు బందుత్వం కూడా ఉంది అంటారు. మరి ఎందుకు మాట్లాడలేదు. వ్యాపారాలు చేసుకునే మహిళలను రాజకీయాల్లోకి లాగడం ఎందుకు అని అప్పుడు లా చదివిన సో కాల్డ్ వకీల్ సాబ్ లు ఎందుకు స్పందించలేకపోయారు. ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా రాజకీయాల్లో ఈ రొచ్చుకి ముగింపు పలకాలి. రాజకీయ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. తమ అభిమానులను కార్యకర్తలను అదుపులో పెట్టాలి. సంస్థాగత నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో అయినా ఈ రొచ్చు ఉండదు అని ఆశిద్దాం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్