Saturday, September 13, 2025 03:25 AM
Saturday, September 13, 2025 03:25 AM
roots

లడ్డూ వ్యవహారంలో బాబు సర్కార్ కి సుప్రీంలో భంగపాటు

దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న.. తిరుమల లడ్డూ వివాదంపై నేడు సుప్రీం కోర్ట్ లో జస్టిస్ బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్‌ ధర్మాసనం విచారణ జరిపింది. అన్ని పిటీషన్ లను ఈ సందర్భంగా సుప్రీం కోర్ట్ కలిపి విచారించింది. నెయ్యి లోపలికి వచ్చే ముందు టెస్టింగ్‌కు ఒక మెకానిజం ఉందని.. సీఎం, ఈవో చేసిన కామెంట్స్‌ వేర్వేరుగా ఉన్నాయంటూ పిటిషనర్ల తరపు లాయర్లు తమ వాదనలు వినిపించారు. సీఎం వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయని.. తద్వారా భక్తులు గందరగోళానికి గురయ్యారు అంటూ కోర్ట్ దృష్టికి తీసుకు వెళ్ళారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి తరుపు న్యాయవాది కూడా తన వాదనలు వినిపించారు.

ప్రభుత్వ ఆరోపణల అనంతరం టీటీడీ అధికారి కల్తీ నెయ్యి వాడలేదని చెప్పారని.. సీఎం ప్రకటన వివాదాస్పదమైంది అంటూ కోర్ట్ దృష్టికి తీసుకు వెళ్ళారు. అలాగే కల్తీ నెయ్యి వంద శాతం వాడలేదని టీటీడీ అధికారి చెబుతున్నారని… అన్ని అంశాలపై సుప్రీం పర్యవేక్షణలో విచారణ జరపాలని సుబ్రమణ్యస్వామి తరపు లాయర్ కోర్ట్ ని కోరారు. ఇక ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం పలు కీలక ప్రశ్నలు సంధించింది. నెయ్యి రిపోర్ట్‌పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? అని ప్రశ్నించించిన ధర్మాసనం.. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండని కోరుతూ ప్రభుత్వ న్యాయవాదులకు పలు కీలక ప్రశ్నలు సంధించింది.

Read Also : స్వామీజీలతో జగన్ నయా ప్లాన్

నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించండని రాష్ట్ర ప్రభుత్వ తరుపు న్యాయవాదిని ఆదేశించింది. లడ్డూ కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపిల్ ల్యాబ్‌కు పంపారా?, ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదు?, లడ్డూలను ముందుగానే పరీక్షలకు ఎందుకు పంపలేదు.. మైసూర్‌ లేదా గజియాబాద్ ల్యాబ్‌ల నుంచి ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు, సెప్టెంబర్ 18న సీఎం బాబు ప్రకటనకు ప్రాధమిక ఆధారం ఏమిటి? AR డెయిరీతో పాటు ఇతర కంపెనీల శాంపిల్స్ ఎందుకు సేకరించలేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇక కల్తీ నెయ్యిని లడ్డూ వినియోగంలో వాడినట్లు ఆధారాలు లేవన్న సుప్రీం కోర్ట్… విచారణను వచ్చే నెల 3 కి వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. మరి ఈకేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్