చక్కెరను స్వీట్ పాయిజనన్ అని పిలుస్తుంటారు. దీనిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి, పోషకాలు ఉండవు. చక్కెర ఎక్కవగా ఉండే.. ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరానికి క్యాలరీలు ఎక్కువగా అందుతాయి, దీనివల్ల అధిక బరువ, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇవి నిజమే కానీ,.. చక్కెర గురించి చాలా మందికి ఎన్నో అపోహలు ఉంటాయి. దీంతో చాలామంది వాళ్లకు ఇష్టమైన స్వీట్స్‌ను పూర్తిగా దూరం పెట్టేస్తారు. చక్కెర గురించి ఉన్న అపోహలు ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం.
చాలా మంది స్వీట్స్, చక్కెర తినడం ఓ వ్యసనం లాంటిదని నమ్ముతుంటారు. అయితే.. చక్కెర ఎడిక్టివ్ అని ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కొంతమందికి, ఏదైనా తీపి తినడం వల్ల డోపమైన్ పెరుగుతుంది కానీ అది వ్యసనంలా మారదు. కొందరు స్వీట్స్‌ను ఎక్కువగా తినొచ్చు, వేరే ఆహారాల కంటే.. చక్కెరను ఎక్కువగా తినవచ్చు, అంతేగానీ చక్కెర తినడం వ్యసనంలా మారదు.