సమ్మర్ దాదాపు వచ్చేసింది. ఈ సమయంలో చాలా మంది వాటర్, జ్యూస్‌లు తాగుతుంటారు. తాగాలి కూడా. అప్పుడే డీహైడ్రేట్ కాకుండా ఉంటారు. అయితే, ఈ టైమ్‌లో చాలా మంది జ్యూస్‌లు తాగుతుంటారు. మరి అవి హెల్దీగా కూడా ఉండాలిగా. అలాంటి హెల్దీ చెరకు రసం గురించి తెలుసుకోండి.
చెరకురసంలో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి బాడీకి శక్తిని అందిస్తాయి. ఓ గ్లాసు చెరకు రసం తాగితే మన శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గుతుంది. డీహైడ్రేషన్ సమస్య కూడా దూరమవుతుంది.
చెరకురసంలో యాంటీ ఆక్సిడెంట్స్, మెగ్నీషియం, ఐరన్, ఇంకా మరెన్నో పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన చర్మానికి చాలా మంచివి. శరీర బలాన్ని పెంచి ఇమ్యూనిటీని బలంగా చేస్తాయి. అంతేకాకుండా బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వృద్ధాప్య లక్షణాలు దూరమై చర్మం మెరుస్తుంది.