Friday, October 23, 2026 07:25 PM
Friday, October 23, 2026 07:25 PM

వైసీపీకి ఎన్నికలంటే యుద్ధమేనా..?

ఎన్నిక ఏదైనా సరే.. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలి. కానీ వైసీపీ నేతల దృష్టిలో మాత్రం.. ఎన్నిక అంటే యుద్ధానికి సిద్ధం అంటారు. దాడులు చేయాలి, తన్నాలి, కొట్టాలి.. అడ్డుకున్న పోలీసులను కూడా తన్నాలి.. ఇదే వైసీపీ నేతలు చేస్తున్న పనులు. తొలి నుంచి వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. తాజాగా ప్రజాస్వామ్యం , అరాచకం అంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పారు. అయితే ఆ మాటలు నీటి మీద మూటలు అని సాక్ష్యాలతో సహా రుజువు చేస్తున్నారు తెలుగుదేశం, జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు.

Also Read : కదిరి వైసీపీలో భగ్గుమన్న వర్గపోరు..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 107 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుంటే.. నాలుగు చోట్ల మాత్రమే గొడవలు జరుగుతున్నాయి. కానీ.. వాటినే బూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా అభిమానులు. ఎన్నికలు రద్దు చేయాలని.. కేంద్ర పారామిలటరీ బలగాలను దింపాలని.. కేంద్రమే నేరుగా ఎన్నికలు జరిపించాలనేది వైసీపీ నేతల డిమాండ్. అయితే ఇక్కడే అందరిలో ఒక అనుమానం తలెత్తుతోంది. వైసీపీ నేతలు నిజంగా గతం మర్చిపోయారా.. లేక జనాలు మరిచిపోయారని అనుకుంటున్నారా.. అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి ఎన్నికలు పూర్తిగా రద్దు అనే మాట 2021లోనే వచ్చింది. ఎందుకంటే.. కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పట్లో ప్రకటన చేసిన వెంటనే.. వైసీపీ నేతలు.. మేము చూడని వైరస్‌లా, మాకు తెలియని వైరస్‌లా.. అది కరోనా కాదు.. కమోనా.. అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కరోనా విజృంభించడంతో.. సైలెంట్‌గా తోక ముడిచారు. అయినా సరే.. నాటి సీఎం వైఎస్ జగన్.. అది బ్లీచింగ్ చల్లితే సరిపోతుంది.. అంతే.. అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులకే వైద్య సలహాలిచ్చారు. కానీ.. ఆ తర్వాతే వైసీపీ నేతలంతా కరోనా వచ్చిన తర్వాత వైద్యం కోసం హైదరాబాద్, చెన్నై వెళ్లిపోయారు.

Also Read : ఇషాన్ ఔట్.. వైభవ్ ఇన్? రెండో టీ20లో ఛాన్స్ దక్కేనా?

ఎన్నికల విషయంలో వైసీపీ నేతలు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఎన్నిక ఏదైనా సరే.. తామే గెలవాలనేది వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట. అందుకే.. ఏమైనా చేయండి.. కానీ ఎన్నికల్లో గెలవండి.. అంటూ అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా పార్టీ కార్యకర్తలు, నేతలతో చెప్పిన వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే.. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మాచర్ల మునిసిపాలిటి పరిధిలోని 31 వార్డులు కూడా ఏకగ్రీవం చేసుకున్నారు వైసీపీ నేతలు. అంటే టీడీపీ నేతలనే కాదు.. వామపక్షాలకు చెందిన నాయకులను కూడా ఏ రేంజ్‌లో భయపెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక్క మాచర్లలో జరిగిందే కాదు. రాష్ట్రంలో చాలా మునిసిపాలిటీల్లో ఇదే పరిస్థితి.

మరో విషయం ఏమిటంటే.. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలనేది ఇప్పుడు వైసీపీ అధినేత చేస్తున్న ప్రధాన డిమాండ్. కానీ.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు.. అందరూ చూస్తుండగానే.. ఓ ప్రజాప్రతినిధి, మాజీ ప్రజా ప్రతినిధి, ఓ న్యాయవాది పైన కర్రలతో దాడి చేశారు. మాచర్లలో బుద్దా వెంకన్న, బోండా ఉమపై హత్యాయత్నం చేసిన తురక కిషోర్‌ను ఏకంగా మునిసిపల్ చైర్మన్‌ను చేశారు జగన్. దాడి చేసిన కిషోర్ పై చర్యలు తీసుకోకుండా.. పదవి ఇవ్వటం ఏమిటని ప్రశ్నిస్తే.. ఆయన దాడి చేయలేదు కదా.. అని ఎదురు ప్రశ్నించారు కూడా. ఇక సిద్ధం సభల పక్కనే.. చంద్రబాబు, పవన్ బొమ్మలు పెట్టి.. వాటిని తమ కార్యకర్తలతో తన్నిచ్చారు. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత రప్పా రప్పా అంటూ బెదిరిస్తున్నారు. అందుకే వైసీపీకి ఎన్నికలంటే యుద్ధమేనా.. అనే ప్రశ్నకు.. అవుననే సమాధానమే వస్తుంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

బొత్సకు జడ్పీ పీఠం...

విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో...

కదిరి వైసీపీలో భగ్గుమన్న...

శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ వైఎస్సార్...

బ్రేకింగ్ : మరోసారి...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

మేఘన ప్రాణాలకు ముప్పు.....

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి...

మేయర్ ఖర్చు భారం...

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ...

వైసీపీ నేతలకు రాచమర్యాదలు.....

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం సబ్ డివిజన్...

పోల్స్