Friday, October 23, 2026 04:38 PM
Friday, October 23, 2026 04:38 PM

ఇషాన్ ఔట్.. వైభవ్ ఇన్? రెండో టీ20లో ఛాన్స్ దక్కేనా?

న్యూజిలాండ్‌తో రెండో టీ20కి ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. కుడి తొడ లోపలి భాగంలోని కండరాల్లో స్వల్ప గాయం కారణంగా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కుతుందా అన్న ఆసక్తి నెలకొంది. శుక్రవారం జరిగిన భారత జట్టు ఐచ్ఛిక ప్రాక్టీస్ సెషన్‌లో వైభవ్ బ్యాటింగ్ సాధన చేశాడు. అనంతరం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో మాట్లాడటం కనిపించింది. త్రోడౌన్ స్పెషలిస్టులు, స్పిన్నర్లను ఎదుర్కొంటూ వైభవ్ సుమారు 40 నిమిషాలపాటు సాధన చేశాడు. కుల్దీప్ యాదవ్‌తో కలిసి ఫీల్డింగ్ డ్రిల్స్‌లోనూ పాల్గొన్నాడు.

Also Read : బ్రేకింగ్ : మరోసారి బాబు తో పవన్ భేటీ.. ఎం జరుగుతోంది?

కిషన్ స్థానంలో వైభవ్‌ను ఆడించే అవకాశముందని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ సూచించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. కిషన్ పూర్తిగా కోలుకోకపోతే అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు వైభవ్ బలమైన పోటీదారుల్లో ఒకడని చెప్పారు. అయితే వైభవ్ ఎంపికపై బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక నిర్ధారణ రాలేదు. కిషన్ గాయం తొలి టీ20లో భారత బ్యాటింగ్ క్రమంపైనా ప్రభావం చూపినట్లు కోటక్ వివరించారు. సాధారణంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే కిషన్.. గురువారం క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన సిరీస్ తొలి మ్యాచ్‌లో ఐదో స్థానంలో బరిలోకి దిగాడు. గజ్జల్లో కండరాల గాయం కారణంగానే ఈ మార్పు చేయాల్సి వచ్చిందని కోటక్ స్పష్టం చేశారు.

Also Read : మేయర్ ఖర్చు భారం మొత్తం అవినాష్ పైనే..?

ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రెండో టీ20కి కిషన్ దూరమైన నేపథ్యంలో జట్టు యాజమాన్యం ఎలాంటి కూర్పును ఎంచుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రాక్టీస్‌లో చెమటోడ్చిన వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో అధికారిక ప్రకటనతో తేలనుంది. ఇప్పటికే మాజీ కోచ్ రవి శాస్త్రి మరియు దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ వైభవ్ ని తుది జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రవి శాస్త్రి ఒక అడుగు ముందుకేసి.. న్యూజిలాండ్ క్రికెట్ అభిమానులు వైభవ్ ఆతని ప్రత్యక్షంగా తిలకించాలని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. దీంతో రెండవ మ్యాచ్ లో వైభవ్ ఆడటం ఖాయంగా కనిపిస్తుంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

కదిరి వైసీపీలో భగ్గుమన్న...

శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ వైఎస్సార్...

బ్రేకింగ్ : మరోసారి...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

మేఘన ప్రాణాలకు ముప్పు.....

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి...

మేయర్ ఖర్చు భారం...

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ...

వైసీపీ నేతలకు రాచమర్యాదలు.....

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం సబ్ డివిజన్...

వైసీపీ నేతలు ఇప్పుడైనా...

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల వేళ...

పోల్స్