Thursday, October 22, 2026 01:02 PM
Thursday, October 22, 2026 01:02 PM

చెవిరెడ్డి ఫ్యామిలీ ఓవరాక్షన్.. పోలీసుల రియాక్షన్..!

తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్తతలు, ఆందోళనల పరిణామాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించడం లేదంటూ వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి కలెక్టరేట్ ప్రాంగణంలో భారీ నిరసనకు దిగారు.

Also Read : మంత్రి నియోజకవర్గంలో కూటమికి రెబల్స్ తలనొప్పి..!

ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కలెక్టరేట్ పరిసరాల్లో ఆంక్షలను ఉల్లంఘించి ఆందోళనలు చేపట్టడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంపై స్థానిక ఎస్సై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలతో పాటు వారి కుటుంబ సభ్యులు, మరో 15 మంది ముఖ్య అనుచరులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Also Read : మళ్లీ మొదలుపెట్టారు.. బీ అలర్ట్..!

అనుమతి లేకుండా ప్రభుత్వ కార్యాలయం వద్ద ఆందోళనలు నిర్వహించడంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల నిబంధనలను అతిక్రమించి ప్రభుత్వ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించడం, విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవడం వంటి అంశాలపై కూడా ఈ కేసుల్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పరిణామాలతో చంద్రగిరి నియోజకవర్గంతో పాటు తిరుపతి జిల్లా వ్యాప్తంగా రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చంద్రగిరి, తిరుపతి పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఏపీ మున్సిపల్ ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల...

మళ్లీ మొదలుపెట్టారు.. బీ...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చాలు.....

రాచమల్లు.. బరితెగింపు అంటే...

"రాజకీయాల్లో మరీ బరితెగించారు.. ఎంత దారుణమంటే.....

బ్రేకింగ్: ఏపీ ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో అత్యున్నత...

మంత్రి నియోజకవర్గంలో కూటమికి...

మంత్రి గుమ్మడి సంద్యారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న...

SBI ఖాతాదారుల డేటా...

దేశంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ...

పోల్స్