Tuesday, October 20, 2026 07:00 PM
Tuesday, October 20, 2026 07:00 PM

బెజవాడలో దూకుడు పెంచిన ఏబీవీ..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు విజయవాడ. అలాంటి బెజవాడ మునిసిపల్ ఎన్నికలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. వాస్తవానికి అంతా ఇప్పటి వరకు తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాత్రమే పోటీ ఉంటుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా బెజవాడ కార్పొరేషన్‍‌ను జనసేనకు కేటాయించడంతో అంతా ఆశ్చర్యపోయారు. జనసేన తరఫున మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధకృష్ణ పోటీ చేస్తున్నారు. దీంతో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులను వెతకాల్సి వచ్చింది. చివరికి రాయన భాగ్యలక్ష్మి పేరును ప్రకటించారు. దీంతో అంతా రాధ గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.

Also Read : వైసీపీకి షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు..!

విజయవాడ అనగానే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది రెండు అగ్ర వర్ణాల మధ్య ఆధిపత్య పోరు. అవే కమ్మ, కాపు సామాజిక వర్గాలు. ఈ వివాదం ఈ రోజు మొదలైంది కాదు. సుమారు 40 ఏళ్లుగా విజయవాడలో ఈ పోరు నడుస్తోంది. ప్రతి ఎన్నికలో ఇదే పరిస్థితి. అయితే ఈ సారి మాత్రం.. ఆ పోరు ఉండదని అంతా అనుకున్నారు. ఎన్నిక ఏకపక్షం అని అంతా అనుకుంటున్న సమయంలో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్రావు ఎంట్రీ ఇచ్చారు. దీంతో మళ్లీ కాపు, కమ్మ వార్ తప్పదా అనే మాట తెర పైకి వచ్చింది. మరో వైపు రెండుసార్లు కార్పొరేషన్‌పై జెండా ఎగురవేసిన కమ్యూనిస్టులు బెజవాడలో మళ్లీ తమ ఉనికి చాటుకునేందుకు ఏబీవీకి మద్దతు తెలిపారు. దీంతో బెజవాడ పోరు మరింత ఆసక్తిగా మారింది.

ఓ వైపు విజయవాడ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఏబీవీ దూకుడు పెంచారు. తాను మేయర్‌గా ఎన్నికైతే విజయవాడకు ఏం చేయగలను అనే అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ప్రధాన పార్టీల కంటే ముందు తన సొంత మ్యానిఫెస్టో విడుదల చేశారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో ప్రధానంగా ఏబీవీ వేసిన ప్రశ్న ఇప్పుడు అందర్నీ ఆలోచనకు గురి చేస్తోంది. పట్టణాభివృద్ధి నిధుల్లో ఇన్నాళ్లు తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు విజయవాడ అభివృద్ధికి అన్యాయం చేసారా..? అంటూ ప్రశ్నించారు. విశాఖపట్నంకు రూ.4 వేల కోట్ల, విజయవాడకు రూ.140 కోట్లు.. ఎందుకీ వివక్ష.. విజయవాడ అభివృద్ధి విషయంలో పోరాడటానికి మేయర్ అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తున్న ఏబీవీ.. అంటూ మొదలుపెట్టారు.

Also Read : టాటా కార్లపై ఏకంగా 3.35 లక్షల రూపాయల వరకు భారీ డిస్కౌంట్లు..!

మున్సిపాలిటీలో అవినీతి, అసమర్థత ఉండవని.. విజయవాడలో మరిన్ని నైట్ ఫుడ్ మార్కెట్లు, కాలువల్లోకి మురుగునీరు నిషేధం, కాలువ కట్టలపై, కాలువల్లో చెత్త వేయకుండా అడ్డుకోవడం, క్రీడలు, వినోద సౌకర్యాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ద్వారా దోమల నియంత్రణ, గోతులు లేని మున్సిపల్ రోడ్లు, ఆస్తి పన్నుల పెంపు ఫ్రీజ్, అత్యంత సురక్షిత నగరం, బుడమేరు వరద పరిష్కారం కోసం పోరాటం, ట్రాఫిక్ పార్కింగ్ సమస్యల నుంచి ఉపశమనం, విజయవాడ విమానాశ్రయాన్ని కాపాడుతాం, డయల్ 100, 5 నిమిషాల్లో స్పందన, వీధి వ్యాపారులతో సహా అన్ని వ్యాపారాలకు ప్రభుత్వ శాఖల వేధింపుల నుండి రక్షణ, వెండర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు, 18 వేల మంది వీధి వ్యాపారులకు వెండింగ్ సర్టిఫికెట్లు.. వంటి హామీలను ఏబీవీ ప్రకటించారు.

విజయవాడ అంటే.. వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులే ఎక్కువ. ఇప్పుడు వారినే ఏబీవీ టార్గెట్ చేశారు. అలాగే కాలువల్లో అపరిశుభ్రతపై కూడా ఏబీవీ ఓ మెగా కార్యాచరణను అమలు చేస్తున్నట్లు మేనిఫెస్టోలో వెల్లడించడం ఇప్పుడు మరింత ఆసక్తి రేపుతోంది. బుడమేరు ముంపు గురించి అందరికీ గుర్తే.. కాబట్టే దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు కూడా బాగా ఇబ్బందిగా ఉన్నాయి. వీటి పైనే ఏబీవీ ఇప్పుడు ఫోకస్ పెట్టారు. మరి ఏబీవీ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

సొంతగడ్డపై నామినేషన్లు వేయించలేకపోయిన...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైన...

11తో విజయసాయిరెడ్డి మాస్...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కంట్లో...

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన...

కడపలో.. జగన్‌కే.. లోకేష్ ఝలక్ ఇవ్వగలిగారా..?...

సిక్కోలు వైసీపీకి షాక్.....

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ...

వైసీపీకి షాక్ ఇచ్చిన...

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ,...

పులివెందులపై వైసీపీ పట్టు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికి దశాబ్దాలుగా...

పోల్స్