Tuesday, October 20, 2026 06:34 AM
Tuesday, October 20, 2026 06:34 AM

ఈరోజు రాశి ఫలితాలు (20-10-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్ల పక్షం.. 20-10-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

ఋణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగమున అధికారులతో నూతన సమస్యలు తప్పవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు.
—————————————

వృషభం

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
—————————————

మిధునం

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ధన వ్యవహారాలు అంతగా కలసిరావు. నూతన వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి.
—————————————

కర్కాటకం

వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయంతో పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటాబయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.
—————————————

సింహం

ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపోతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి.
—————————————

కన్య

నూతన కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత ఋణాలు తీరుస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసివస్తాయి. మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది.
—————————————

తుల

ఉద్యోగమున అందరితో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విద్యార్థులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.
—————————————

వృశ్చికం

వృత్తి వ్యాపారాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి. ఇంటాబయట ఒత్తిడులు అధికమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పితృవర్గం వారితో మాట పట్టింపులుంటాయి. అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది.
—————————————

ధనస్సు

వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
—————————————

మకరం

వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. గృహనిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఉద్యోగమున మీ మాటకు విలువ మరింత పెరుగుతుంది. ఇతరుల అవసరానికి సైతం ధన సహాయం చేస్తారు. వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది.
—————————————

కుంభం

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు.
—————————————

మీనం

ఉద్యోగమున చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. సంతాన విద్యా విషయాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడుతాయి.

—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహన కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

సిక్కోలు వైసీపీకి షాక్.....

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ...

వైసీపీకి షాక్ ఇచ్చిన...

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ,...

పులివెందులపై వైసీపీ పట్టు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికి దశాబ్దాలుగా...

పల్లె పండుగ రోడ్డు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె...

జనసేనకు టీడీపీ సవాల్.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి....

జగన్.. వారం క్రితం...

అదేదో చేయలేక మంగళవారం అన్నాడట.. వెనకటికి...

పోల్స్