Monday, October 19, 2026 03:41 PM
Monday, October 19, 2026 03:41 PM

పల్లె పండుగ రోడ్డు ధ్వంసంపై సీఎం, డిప్యూటి సిఎం సీరియస్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా నిర్మించిన రహదారులను ధ్వంసం చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతి జిల్లా పుల్లంపేట మండల పరిధిలోని అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య సుమారు రూ.4.75 కోట్ల భారీ వ్యయంతో నూతనంగా నిర్మించిన రోడ్డును కొందరు దుండగులు దాదాపు 100 మీటర్ల మేర ట్రాక్టర్‌తో దున్నేసి ధ్వంసం చేశారు.

Also Read: జగనన్న.. ఈసారి వాళ్లకు టికెట్లు ఇస్తారా.. లేదా..?

ఈ దారుణ ఘటనపై క్షేత్రస్థాయి అధికారుల నుంచి నివేదికలు అందుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. కూటమి ప్రభుత్వం గ్రామాల్లో చేపడుతున్న వేగవంతమైన అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతలు ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు.

గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చడానికి, ప్రజల రవాణా సౌకర్యార్థం నిర్మించిన రహదారిని ఇష్టానుసారంగా పాడుచేయడం వారి వికృత చేష్టలకు అద్దం పడుతుందని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తూ, ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రభుత్వ ప్రగతిని అడ్డుకోవాలని చూసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మరోవైపు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ ఈ ఉదంతాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు.

Also Read : జగన్.. వారం క్రితం జరిగిందే మర్చిపోయారా..?

రోడ్డును కావాలనే ట్రాక్టర్లతో దున్నిన నిందితులపై తక్షణమే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. అంతేకాకుండా, రహదారి ధ్వంసం కావడం వల్ల ప్రభుత్వానికి జరిగిన ఆర్థిక నష్టాన్ని పూర్తిగా నిందితుల నుంచే భర్తీ చేయాలని స్పష్టం చేశారు. ఇందుకోసం రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద బాధ్యుల ఆస్తుల నుంచి ఆ నష్టపరిహారాన్ని వసూలు చేయాలని అధికారులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పులివెందులపై వైసీపీ పట్టు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికి దశాబ్దాలుగా...

జనసేనకు టీడీపీ సవాల్.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి....

జగన్.. వారం క్రితం...

అదేదో చేయలేక మంగళవారం అన్నాడట.. వెనకటికి...

రాష్ట్రమంతా ప్రశాంతం.. అక్కడ...

ఏపీలో నిజంగానే గొడవలు జరుగుతున్నాయా..? ఏపీలో...

తిరువూరు కూటమిలో అసమ్మతి.....

కూటమిలో కుంపటి రాజేశారు. తొలి నుంచి...

Garividi Lakshmi Review:...

ఉత్తరాంధ్ర జానపద కళాసంప్రదాయంలో తనకంటూ ప్రత్యేక...

పోల్స్