Monday, October 19, 2026 03:45 PM
Monday, October 19, 2026 03:45 PM

మార్కెట్లో కనపడని ₹500 నోట్లు.. అసలేం జరుగుతోంది..?

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఎవరిని కదిలించినా ఒకటే మాట వినిపిస్తోంది.. అదే.. నా దగ్గర క్యాష్ లేదు. ఆన్‌లైన్ లావాదేవీలు, డిజిటల్ పేమెంట్స్ ఎంత పెరిగినా క్షేత్రస్థాయిలో మాత్రం నగదు కొరత తీవ్ర రూపం దాల్చింది. మార్కెట్‌లో ఒక్కసారిగా నగదు ప్రవాహం తగ్గిపోవడంతో లావాదేవీలు కుంటుపడి, వ్యాపారాలు పూర్తిగా కుదేలవుతున్నాయి. చిన్న కిరాణా కొట్టు నడుపుకునే సామాన్య వ్యాపారి నుంచి వందల కోట్ల టర్నోవర్ చేసే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థల వరకు అందరి పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది.

Also read : జగనన్న.. ఈసారి వాళ్లకు టికెట్లు ఇస్తారా.. లేదా..?

ఆర్బీఐ నుంచి బ్యాంకులకు నగదు సరఫరా భారీగా తగ్గడమే ఈ ఆకస్మిక సంక్షోభానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ నగదు కొరత ప్రభావం ముఖ్యంగా నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాలపై తీవ్రంగా పడింది. సాధారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో రిజిస్ట్రేషన్లు, భూముల కొనుగోళ్లకు పెద్ద మొత్తంలో నగదు అవసరమవుతుంది. అయితే బ్యాంకుల నుంచి కనీసం రూ.2 కోట్లు విత్‌డ్రా చేయడానికి వెళ్లినా నగదు నిల్వలు లేవంటూ బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో సిమెంట్, స్టీల్, ఇసుక వంటి అనుబంధ వ్యాపారాలు సాగక, పనులు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు చలామణీలో ఉండాల్సిన రూ.500 నోట్లు మార్కెట్లో మాయమవ్వడం పెద్ద మిస్టరీగా మారింది. గతంలో రూ.2000 నోట్లను రద్దు చేసిన తర్వాత రూ.500 నోట్లే ప్రధాన ఆధారం కాగా, ప్రస్తుతం చాలా మంది ఈ పెద్ద నోట్లను బ్యాంకులకు రాకుండా ఇళ్లలోనే దాచేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకులు, ఏటీఎంలలో కేవలం రూ.100, రూ.200 నోట్లు మాత్రమే అందుబాటులో ఉండటం వ్యాపార సంస్థల రోజువారీ అంచనాలను దెబ్బతీస్తోంది.

Also read : జగన్.. వారం క్రితం జరిగిందే మర్చిపోయారా..?

ఈ ఆర్థిక అనిశ్చితి వల్ల మధ్యతరగతి వర్గం కూడా అలర్ట్ అయి పొదుపు మంత్రం జపిస్తోంది. మార్కెట్ పరిస్థితులు, ఉద్యోగ భద్రతపై భయాలతో అనవసర ఖర్చులకు బ్రేక్ వేస్తున్నారు. చేతిలో ఉన్న కొద్దిపాటి నగదును బయటకు తీయకుండా బంగారం, వెండి లేదా మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలోని చిన్న మొత్తాల వైపు మళ్లిస్తున్నారు. ఫలితంగా నిత్యావసర మార్కెట్లు, హోల్‌సేల్ దుకాణాలు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. అటు కరెంట్ అకౌంట్ల ద్వారా వ్యాపారం చేద్దామన్నా బ్యాంకులు విత్‌డ్రా పరిమితుల పేరిట ఆంక్షలు విధిస్తుండటంతో ఆర్డర్లు క్యాన్సిల్ అయి ప్రాజెక్టుల పురోగతి నిలిచిపోతోంది. డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉన్నా, హార్డ్ క్యాష్ లేకపోతే వ్యవస్థ ఎంతలా స్తంభిస్తుందో ఈ ప్రస్తుత సంక్షోభం స్పష్టం చేస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పులివెందులపై వైసీపీ పట్టు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికి దశాబ్దాలుగా...

పల్లె పండుగ రోడ్డు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె...

జనసేనకు టీడీపీ సవాల్.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి....

జగన్.. వారం క్రితం...

అదేదో చేయలేక మంగళవారం అన్నాడట.. వెనకటికి...

రాష్ట్రమంతా ప్రశాంతం.. అక్కడ...

ఏపీలో నిజంగానే గొడవలు జరుగుతున్నాయా..? ఏపీలో...

తిరువూరు కూటమిలో అసమ్మతి.....

కూటమిలో కుంపటి రాజేశారు. తొలి నుంచి...

పోల్స్