Saturday, October 17, 2026 07:08 PM
Saturday, October 17, 2026 07:08 PM

ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే.. అసలు సినిమా వేరే..!

“మా ఓటర్లు వేరే ఉన్నారు.. సార్వత్రిక ఎన్నికల్లో మేమే గెలుస్తాం.. మాకు ఆ నమ్మకం ఉంది..” ఈ మాటలు ఇప్పటికీ ప్రతి వైసీపీ కార్యకర్తకే కాదు.. ఏపీలోని ప్రతి ఓటరుకు బాగా గుర్తు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచిన తర్వాత.. మీడియా మిత్రులంతా కలిసి నాటి ప్రభుత్వ ప్రధాన సలహాదారు, సకల శాఖ మంత్రి, వైసీపీ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. అప్పుడు ఆయన చెప్పిన మాటలే ఇవి. నిజానికి ఈ మాటలు నిజమని అప్పటికే రుజువైంది కూడా. తిరుపతి ఉప ఎన్నికల్లో పక్క రాష్ట్రం నుంచి కూడా జనాల్ని తీసుకువచ్చి ఓట్లు వేయించేందుకు యత్నించి వైసీపీ నేతల బాగోతాన్ని టీడీపీ, బీజేపీ నేతలు అప్పట్లోనే బయటపెట్టారు. అయినా సరే.. ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు తెగబడ్డారు. మాచర్లలో ఈవీఎం పగలగొట్టారు. ఓటు వేసేందుకు వచ్చిన టీడీపీ నేతలపై దాడులకు తెగబడ్డారు వైసీపీ మూకలు.

అయినా సరే.. ఫలితం మాత్రం వైసీపీకి వ్యతిరేకంగా వచ్చింది. భారీ మెజారిటీతో కూటమి గెలిచింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. 28 నెలలుగా కూటమి అధికారంలో ఉన్నప్పటికీ.. వైసీపీ నేతల దాడులు మాత్రం ఎక్కడా ఆగలేదు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైన తొలిరోజే.. వైసీపీ నేతలు తమ సహజ నైజం బయటపెట్టారు. పుంగనూరు, రాయచోటి, తిరుపతిలో రెచ్చిపోయారు. అయితే ఇవన్నీ జస్ట్ శాంపిల్ మాత్రం.. అసలు సినిమా ముందు ఉందని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు వైసీపీ మూకలు. లోకల్ వార్ నామినేషన్ల మొదటిరోజే.. జీపులతో మనుషులను తొక్కించారు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ప్రభుత్వ కార్యాలయం గేటు బద్దలు కొట్టారు. పోలీసుల ముందే దాడులకు తెగబడ్డారు. ఇది జస్ట్ శాంపిల్.

ఎందుకంటే.. ఇప్పటికే వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు చెబుతున్న మాట.. “రప్పా రప్పా..”, “మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత.. ఒక్కొక్కరికి..” “రండి నా కొడకల్లారా..” అంటూ బెదిరిస్తున్నారు. ఇవన్నీ కేవలం బెదిరింపు మాత్రమే కాదు.. అధికారంలోకి వస్తే చేసి చూపిస్తామని దాడులతో రుజువు చేశారు. ఇప్పుడే ఇలా ఉంటే.. లోకల్ బాడీ ఎన్నికల పోలింగ్ రోజు ఇంకెలా ఉంటారో.. సార్వత్రిక ఎన్నికల నాటికి వైసీపీ నేతలు మరింత రెచ్చిపోవటం ఖాయమనే భయం ఇప్పుడు ప్రజల్లో కనిపిస్తోంది. పార్టీ అధినేత, పెద్దల తీరుపై కూడా తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. “తప్పు చేసిన వారి గుండెల్లో నిద్రపోతా..” అనేది చంద్రబాబు మాట. ఇది కేవలం మాటగానే మిగిలిపోయిందని.. వైసీపీ నేతల గుండెల్లో ఎప్పుడు నిద్రపోతారని సెటైర్లు కూడా వేస్తున్నారు. వైసీపీ నేతలను లైట్ తీసుకుంటే.. భవిష్యత్తులో మరింత రెచ్చిపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు కూడా.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తిరువూరు కూటమిలో అసమ్మతి.....

కూటమిలో కుంపటి రాజేశారు. తొలి నుంచి...

Garividi Lakshmi Review:...

ఉత్తరాంధ్ర జానపద కళాసంప్రదాయంలో తనకంటూ ప్రత్యేక...

రాయచోటిలో ఆయుధాలతో పంజాబ్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

హోం మంత్రి పదవి...

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి...

ఓటమి భయంతోనే దాడులు

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని...

సాక్ష్యాలతో కడిగిపారేసిన ఈడీ.....

మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయి...

పోల్స్