Saturday, October 17, 2026 05:23 PM
Saturday, October 17, 2026 05:23 PM

పిల్లలు ఇంటర్నెట్ వాడటంపై సుప్రీం సంచలన తీర్పు

పిల్లల ఇంటర్నెట్ వినియోగంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఇంటర్నెట్ యాక్సెస్ అనేది పిల్లలతో సహా ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని కోర్టు స్పష్టం చేసింది. వయసును బట్టి పిల్లలపై ఇంటర్నెట్ వాడకం విషయంలో సంపూర్ణ నిషేధం విధించలేమని జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ కె.వి. చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం ఇంటర్నెట్‌ను పొందే, ఉపయోగించే హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు పరిధిలోకి వస్తుందని న్యాయస్థానం వివరించింది.

Also Read : రాయచోటిలో ఆయుధాలతో పంజాబ్ గ్యాంగ్..!

పిల్లలపై వయోపరిమితి ఆధారంగా ఇంటర్నెట్‌పై పూర్తిగా నిషేధం విధించాలనే డిమాండ్‌ను కోర్టు తోసిపుచ్చింది. చట్టం నిషేధించినంత మాత్రాన పిల్లలు ఇంటర్నెట్ వాడటం మానేయరని, ఇలాంటి నిర్ణయం వారి భావప్రకటన స్వేచ్ఛను దెబ్బతీస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. పిల్లల రక్షణ, వారి స్వేచ్ఛ అనేవి ఒకదానికొకటి వ్యతిరేకం కావని, పిల్లలు ఈ రెండింటినీ పొందేందుకు అర్హులని పేర్కొంది. అయితే, ఇదే సమయంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కఠినమైన పేరంటల్ కంట్రోల్స్, చైల్డ్ మోడ్ కంట్రోల్స్ ఉండాలని స్పష్టం చేసింది.

Also Read : హోం మంత్రి పదవి పై అంబటి కర్చీఫ్

ఆన్‌లైన్‌లో పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపుల కంటెంట్ వ్యాప్తిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి అశ్లీల కంటెంట్‌ను అడ్డుకోవడంలో సోషల్ మీడియా సంస్థలు, ప్రభుత్వ అధికారులు విఫలం కావడంపై అసహనం వ్యక్తం చేసింది. ఇంటర్నెట్ నుంచి ఇటువంటి హానికరమైన కంటెంట్‌ను తక్షణమే గుర్తించి తొలగించడానికి వీలుగా ఒక జాతీయ డేటాబేస్, డిజిటల్ ఐడెంటిఫైయర్స్, ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తిరువూరు కూటమిలో అసమ్మతి.....

కూటమిలో కుంపటి రాజేశారు. తొలి నుంచి...

Garividi Lakshmi Review:...

ఉత్తరాంధ్ర జానపద కళాసంప్రదాయంలో తనకంటూ ప్రత్యేక...

రాయచోటిలో ఆయుధాలతో పంజాబ్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

హోం మంత్రి పదవి...

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి...

ఓటమి భయంతోనే దాడులు

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని...

సాక్ష్యాలతో కడిగిపారేసిన ఈడీ.....

మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయి...

పోల్స్