Saturday, October 17, 2026 07:01 PM
Saturday, October 17, 2026 07:01 PM

కేంద్ర బలగాల కోసమే వైసీపీ మైండ్ గేమ్..?

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతోనే రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. అయితే, ఈ గొడవలు మరియు అల్లర్ల వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్కా పొలిటికల్ ప్లాన్ అమలు చేస్తోందనే ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో జోరందుకుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని చూపిస్తూ, కేంద్ర బలగాలను రప్పించడానికే వైసీపీ కావాలని ఈ రచ్చ సృష్టిస్తోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

Also Read : ఓటమి భయంతోనే దాడులు

ఈ వ్యూహంలో భాగంగానే, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ద్వారా ఏపీ హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ పోలీసులు అధికార కూటమికి అనుకూలంగా పనిచేస్తున్నారని, అందువల్ల స్థానిక ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించేలా ఆదేశాలివ్వాలని కోరింది. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. సుజాత వైసీపీ అభ్యర్థనను తోసిపుచ్చారు. పశ్చిమ బెంగాల్ తరహా పరిస్థితులు ఏపీలో లేవని స్పష్టం చేస్తూ, కేంద్ర బలగాల మోహరింపును తిరస్కరించారు.

Also Read : సాక్ష్యాలతో కడిగిపారేసిన ఈడీ.. అవినాష్‌ కన్నీరు

కేవలం నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీలు పెట్టాలని, అభ్యర్థుల భద్రతకు చర్యలు తీసుకోవాలని మాత్రమే కోర్టు ఆదేశించింది. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం, వైసీపీ గ్రౌండ్ లెవెల్‌లో ఉద్రిక్తతలు సృష్టించి, ఆ నెపాన్ని కూటమి ప్రభుత్వంపై నెట్టాలని చూస్తోంది. అలా చేయడం ద్వారా కోర్టులలో, జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది, రాష్ట్రంలో పరిస్థితులు అస్సలు బాగాలేవు అని బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తోందనే టాక్ నడుస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తిరువూరు కూటమిలో అసమ్మతి.....

కూటమిలో కుంపటి రాజేశారు. తొలి నుంచి...

Garividi Lakshmi Review:...

ఉత్తరాంధ్ర జానపద కళాసంప్రదాయంలో తనకంటూ ప్రత్యేక...

రాయచోటిలో ఆయుధాలతో పంజాబ్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

హోం మంత్రి పదవి...

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి...

ఓటమి భయంతోనే దాడులు

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని...

సాక్ష్యాలతో కడిగిపారేసిన ఈడీ.....

మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయి...

పోల్స్