Saturday, October 17, 2026 03:41 PM
Saturday, October 17, 2026 03:41 PM

హోం మంత్రి పదవి పై అంబటి కర్చీఫ్

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎప్పుడూ తనదైన మార్క్ కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల వేడి నడుస్తున్న వేళ, కూటమి ప్రభుత్వంపై ఆయన చేసిన కొన్ని కామెంట్స్ సంచలనంగా మారాయి. “జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కారా..? నేను హోంమంత్రిని కాలేనా..?” అంటూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ సరికొత్త చర్చకు తెరలేపాయి.

Also Read : బియ్యానికీ కృత్రిమ కొరత.. పాలకులు స్పందించరా?

వైసీపీ హయాంలో ఇరిగేషన్ శాఖను నిర్వహించిన అంబటి రాంబాబుకు మొదటి నుంచీ హోంశాఖపై ప్రత్యేక గురి ఉందనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. ప్రస్తుతం ఏపీలో లా అండ్ ఆర్డర్ వైఫల్యాలపై హోంమంత్రి వంగలపూడి అనితను టార్గెట్ చేస్తూ వరుస ప్రెస్ మీట్లు పెడుతున్న అంబటి, భవిష్యత్తులో తానే ఆ కుర్చీలో కూర్చుంటాననే ధీమాను గట్టిగా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు అంబటి పవర్‌ఫుల్ లీడర్ అంటూ పోస్టులు పెడుతుండగా, కూటమి మద్దతుదారులు మాత్రం గత ఎన్నికల్లో ఓడిపోయి కూడా ఇంకా పగటి కలలు కంటున్నారంటూ మీమ్స్, ట్రోల్స్‌తో గట్టి కౌంటర్లు ఇస్తున్నారు.

Also Read : నాడు ‘రక్తచరిత్ర’.. నేడు ‘గొడ్డలి’! సాక్షి తీరు మారలేదా?

ప్రస్తుతం గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాంబాబు, క్షేత్రస్థాయిలో స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో బిజీగా ఉంటూనే అధికారులను హెచ్చరిస్తున్నారు. దాచేపల్లి నగర పంచాయతీలో తమ అభ్యర్థులపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని, ఏకగ్రీవాల కోసం కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆయన మండిపడుతున్నారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్షాలను వేధిస్తున్న అధికారుల పేర్లను డైరీలో రాసి పెట్టుకుంటున్నామని, రేపు తమ ప్రభుత్వం రాగానే హోంమంత్రిగా తానే వారి సంగతి తేలుస్తాననే రేంజ్‌లో అంబటి రాంబాబు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

Garividi Lakshmi Review:...

ఉత్తరాంధ్ర జానపద కళాసంప్రదాయంలో తనకంటూ ప్రత్యేక...

రాయచోటిలో ఆయుధాలతో పంజాబ్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

ఓటమి భయంతోనే దాడులు

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని...

సాక్ష్యాలతో కడిగిపారేసిన ఈడీ.....

మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయి...

నాడు ‘రక్తచరిత్ర’.. నేడు...

నారాసుర రక్త చరిత్ర.. ఈ పేరు...

అప్పుడు.. ఇప్పుడు.. మార్పు...

"అప్పుడు.. ఇప్పుడు.. మార్పు రాలేదు.. అప్పుడు...

పోల్స్