Friday, October 16, 2026 01:22 PM
Friday, October 16, 2026 01:22 PM

కూటమి సీట్ల పంపకం ఖరారు!

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో అధికార కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పట్టణ స్థానిక సంస్థల సీట్ల పంపకంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని 17 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి పార్టీల వారీగా కేటాయింపుల ప్రక్రియ పూర్తయ్యింది. ఈ వివరాలపై కూటమి పార్టీలు అధికారికంగా ప్రకటన జారీ చేశాయి. నాలుగు రోజుల పాటు విస్తృత కసరత్తు అనంతరం ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏ స్థానాలు అనే విషయంపై తుది జాబితాను అధికారికంగా వెల్లడించారు. 17 కార్పొరేషన్లలో 4 జనసేన, 2 బీజేపీకి కేటాయించారు.

Also Read : నవంబర్ 1 నుంచి కాలర్ ఐడీ.. కేంద్రం సంచలన నిర్ణయం..!

కార్పొరేషన్లలో విజయవాడ, కాకినాడ, ఏలూరు, శ్రీకాకుళం మేయర్ స్థానాలను జనసేన పార్టీకి కేటాయించారు. రాజమహేంద్రవరం, అనంతపురం కార్పొరేషన్ల మేయర్ స్థానాలను భారతీయ జనతా పార్టీకి కేటాయించారు. విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, ఒంగోలు సహా మొత్తం 11 కార్పొరేషన్ల మేయర్ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు.

కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూడా మూడు పార్టీల మధ్య సీట్ల పంపకం జరిగింది. పలు పట్టణాల్లో టీడీపీకి ప్రాధాన్యం కల్పించగా, జనసేనకు కొన్ని కీలక పట్టణాలు, బీజేపీకి మరికొన్ని పట్టణాలను కేటాయించారు. మొత్తం 106 మునిసిపల్ స్థానాల్లో టీడీపీకి 78, జనసేన పార్టీకి 21 కేటాయించారు. జనసేనకు కేటాయించిన చైర్మన్ స్థానాల్లో ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాల్లోనే పది మునిసిపాలిటీల్లో జనసేన చైర్మన్ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఉత్తరాంధ్రలో రాజాం, పాలకొండ, సాలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో తిరువూరు, పెడన, గుంటూరు జిల్లాల్లో తెనాలి, చిలకలూరిపేట, ప్రకాశం జిల్లాలోని దర్శి మునిసిపల్ చైర్మన్ జనసేన ఖాతాలో చేరింది. రాయలసీమలో మడకశిర, పుట్టపర్తి, పుత్తూరు మునిసిపాలిటీ చైర్మన్ స్థానాల్లో కూడా జనసేన పోటీ చేయనుంది.

Also Read : ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ వివాదం.. రంగంలోకి ఈడీ..!

మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. స్థానికంగా పార్టీల బలం, నాయకుల ప్రాధాన్యం, గెలుపు అవకాశాలను పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు చేసినట్లు ఆయా పార్టీల నేతలు వెల్లడించారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు కూటమి పార్టీల మధ్య సమన్వయానికి కీలకంగా మారనున్నాయి. సీట్ల పంపకంలో ఆశించిన ప్రాధాన్యం దక్కని ప్రాంతాల్లో స్థానిక నాయకుల స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా జనసేన, బీజేపీలకు కేటాయించిన కార్పొరేషన్లలో అభ్యర్థుల ఎంపిక, స్థానిక నాయకత్వం, ఎన్నికల వ్యూహాలు కీలకం కానున్నాయి. మొత్తంగా, కూటమి సీట్ల పంపకానికి సంబంధించిన జాబితాపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

బ్రేకింగ్: సాయికృష్ణ కేసు...

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన...

అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

వైసీపీకి షాక్.. నా...

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ వైఎస్సార్...

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్...

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1...

జనసేన పోటీ సీట్లపై...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి...

బెజవాడ పాలిట్రిక్స్.. రాధ...

బెజవాడ రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోయాయి....

పోల్స్