Friday, October 16, 2026 02:52 PM
Friday, October 16, 2026 02:52 PM

సిక్కోలు కూటమిలో కలకలం..వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే..!

శ్రీకాకుళం నగర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్న వేళ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. కూటమిలో సీట్ల కేటాయింపు ప్రకటన జారీ అనంతరం లక్ష్మీదేవి పార్టీ మార్పు ఖాయమే అని స్పష్టమవుతోంది. మంచి ముహూర్తం కోసమే లక్ష్మమ్మ వెయిట్ చేస్తున్నట్లు సన్నిహితులు వెల్లడించారు. ఈ పరిణామాలు టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. వైసీపీ తరపున మేయర్ అభ్యర్థిగా లక్ష్మీదేవిని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. గుండ లక్ష్మీదేవితో జగన్ ఫోన్‌లో మాట్లాడారని.. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్వయంగా దగ్గరుండి వైఎస్ జగన్‌తో లక్ష్మీదేవిని ఫోన్ ద్వారా మాట్లాడించినట్లుగా సమాచారం.

Also Read : నవంబర్ 1 నుంచి కాలర్ ఐడీ.. కేంద్రం సంచలన నిర్ణయం..!

గుండ కుటుంబం తొలి నుంచి తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తోంది. 1999 ప్రభుత్వంలో చంద్రబాబు క్యాబినెట్‌లో గుండ అప్పల సూర్యనారాయణ మంత్రిగా కూడా పని చేశారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో వరుసగా ఓడిపోవటంతో.. ఆయనకు బదులుగా.. గుండ లక్ష్మీదేవి 2014లో పోటీ చేసి ధర్మాన ప్రసాదరావుపై 20 వేల ఓట్ల తేడాతో ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఓడిన లక్ష్మీదేవి ఓడిపోయారు. అయితే 2024 ఎన్నికల్లో గుండ కుటుంబాన్ని కాదని గోండు శంకర్‌కు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడంతో.. గుండ కుటుంబం ఆ ఎన్నికలకు దూరంగా ఉంది. ఇటీవల గుండ అప్పల సూర్యనారాయణ మృతి చెందిన తర్వాత ఆయన కుమారులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గుండ కుటుంబానికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో మేయర్ కుర్చీపై గుండ కుటుంబం గంపెడాశలు పెట్టుకుంది. అయితే శ్రీకాకుళం మేయర్ స్థానం జనసేనకు కేటాయించడంతో గుండ కుటుంబం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదే సరైన అవకాశంగా భావించిన వైసీపీ నేతలు.. గుండ కుటుంబంతో చర్చలు జరిపారు. గుండ లక్ష్మీదేవితో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాయభారం నడిపించారు. జగన్ స్వయంగా లక్ష్మీదేవితో మాట్లాడగా ఆమె కుమారులతో ధర్మాన మాట్లాడి వారిని ఒప్పించినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం మేయర్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కావడం.. వైసీపీ తరఫున సరైన అభ్యర్థులు లేకపోవడంతో.. గుండ కుటుంబం కూడా వైసీపీలో చేరేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. మంచి ముహూర్తం చూసుకుని వైసీపీలో చేరేందుకు ఆమె సిద్దమవుతున్నారనే చర్చ ఇప్పుడు సిక్కోలు పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

గుండ కుటుంబం పార్టీ మారుతుందనే పుకారు నేపథ్యంలో టీడీపీ పెద్దలు రంగంలోకి దిగారు. పార్టీ ఉత్తరాంధ్ర నేతలు గుండ లక్ష్మీదేవితో నేరుగా చర్చించినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత గుండ కుటుంబానికి సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ ప్రతిపాదనను తిరస్కరించిన లక్ష్మీదేవి.. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన తమ కుటుంబానికి ఇటీవల ఘోర అవమానం జరిగిందని.. ప్రధానంగా మంత్రి అచ్చెన్నాయుడు తమకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించినట్లు సమాచారం. తొలి నుంచి గుండ, కింజరాపు కుటుంబాల మధ్య మంచి సంబంధాలున్నాయని.. కానీ అచ్చెన్నాయుడు వచ్చిన తర్వాతే.. తమకు రాజకీయంగా అడ్డంకులు కల్పిస్తున్నారని లక్ష్మీదేవి వర్గం ఆరోపిస్తోంది.

Also Read : వైసీపీకి షాక్.. నా దగ్గర డబ్బుల్లేవ్ అంటున్న బెజవాడ మేయర్..!

సార్వత్రిక ఎన్నికల సమయంలో లక్ష్మీదేవికి టిక్కెట్ రాకపోవడంతో ఆ కుటుంబం ఒంటరి అయిపోయింది. మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ మరణించిన సమయంలో చంద్రబాబు నాయుడు హాజరవుతారని అంతా భావించారు. కానీ.. ఆయన దూరంగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి ఆ కుటుంబాన్ని పట్టించునే వారే కరువయ్యారు. టీడీపీ నాయకులెవ్వరు గుండ ఇంటి వైపు చూడటం లేదు. దీంతో గుండ కుటుంబం తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో జనసేనకు మేయర్ టికెట్ కేటాయించడంతో.. వైసీపీ అభ్యర్థిగా లక్ష్మీదేవి బరిలో దిగితే.. గెలుపు ఖాయమంటున్నారు స్థానిక నేతలు. ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నాయి. 15 ఏళ్ళ తర్వాత శ్రీకాకుళం నగర పాలక సంస్థ ఎన్నికలు జరుగనున్నాయి. కూటమి పార్టీలను ఎదుర్కునేందుకు వైసీపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన మార్కు రాజకీయాలు చేస్తున్నారు. మరి ఏమి జరుగుతుందోననేది వేచిచూస్తేనే తెలుస్తుంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

బ్రేకింగ్: సాయికృష్ణ కేసు...

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన...

అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

కూటమి సీట్ల పంపకం...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో అధికార...

వైసీపీకి షాక్.. నా...

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ వైఎస్సార్...

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్...

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1...

జనసేన పోటీ సీట్లపై...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి...

పోల్స్