Friday, October 16, 2026 01:27 PM
Friday, October 16, 2026 01:27 PM

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ వివాదం.. రంగంలోకి ఈడీ..!

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకన వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. ఈ అక్రమాలపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఏపీపీఎస్సీ మాజీ అదనపు కార్యదర్శి పి.ఎస్.ఆర్. ఆంజనేయులుతో పాటు పలువురు కీలక వ్యక్తుల పేర్లను చేర్చినట్లు సమాచారం. గ్రూప్-1 నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, నిధుల అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగడం అటు నిరుద్యోగుల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ సంచలనంగా మారింది.

Also Read : నవంబర్ 1 నుంచి కాలర్ ఐడీ.. కేంద్రం సంచలన నిర్ణయం..!

ఈ వ్యవహారంపై గతంలో జరిగిన సిట్ దర్యాప్తులో అనేక షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. అభ్యర్థుల జవాబు పత్రాలు నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 84 రోజుల పాటు ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఆధీనంలోనే ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా, కనీస అర్హత లేని 66 మంది వ్యక్తులను నిబంధనలకు పాతరేసి మూల్యాంకనదారులుగా నియమించారనే బలమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రూప్-1 లాంటి పరీక్షల పేపర్ల వాల్యుయేషన్‌ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడంపై ఈడీ అధికారులు ఇప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు.

Also Read : బెజవాడ పాలిట్రిక్స్.. రాధ ఫిక్స్.. లైన్‌లోకి బోండా..!

మరోవైపు, ఈ పరీక్షల ఫలితాలను పూర్తిగా తారుమారు చేశారనే ఆరోపణలపై కూడా దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఏజెన్సీ పరిధిలో ముందే నిర్ణయించిన మార్కులను, ఎలాంటి అధికారిక పర్యవేక్షణ లేకుండా నేరుగా ఓఎంఆర్ షీట్లకు బదిలీ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరాయి, తెరవెనుక జరిగిన నగదు లావాదేవీల రూపం ఏంటి అనే కోణంలో ఈడీ తన విచారణను వేగవంతం చేసింది. త్వరలోనే ఈ కేసులో మరిన్ని కీలక అరెస్టులు లేదా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

బ్రేకింగ్: సాయికృష్ణ కేసు...

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన...

అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

కూటమి సీట్ల పంపకం...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో అధికార...

వైసీపీకి షాక్.. నా...

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ వైఎస్సార్...

జనసేన పోటీ సీట్లపై...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి...

బెజవాడ పాలిట్రిక్స్.. రాధ...

బెజవాడ రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోయాయి....

పోల్స్