శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్ల పక్షం.. 16-10-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..
మేషం
శ్రమతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఇంటా బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. బంధువర్గంతో చిన్నపాటి వివాదాలు తప్పవు. వ్యాపారాలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.
—————————————
వృషభం
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగుతాయి. సంతాన వివాహ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. బంధువుల కలయిక ఉత్సాహాన్నిస్తాయి.
—————————————
మిధునం
వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమౌతాయి. చేతిలో డబ్బు నిలవక నూతన ఋణాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.
—————————————
కర్కాటకం
వ్యాపార విస్తరణకు శ్రీకారం చుడతారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. చేపట్టిన వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి.
—————————————
సింహం
మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు. సన్నిహితులతో వివాదాలు కొంత మానసికంగా కలచివేస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.
—————————————
కన్య
వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. సంతాన వివాహయత్నాలు సానుకూలమౌతాయి. ఇంటా బయట నూతన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.
—————————————
తుల
నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇంటాబయట మీ నిర్ణయాలు అందరు గౌరవిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
—————————————
వృశ్చికం
భాగస్థులతో ఒప్పందాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
—————————————
ధనస్సు
ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో ఇబ్బందులు తప్పవు. బంధువులతో మాటపట్టింపులుంటాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
—————————————
మకరం
వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వాహన యోగం ఉన్నది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది.
—————————————
కుంభం
ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరులతో కలహా సూచనలున్నవి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
—————————————
మీనం
ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలున్నవి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు ఉంటాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
—————————————
గమనిక : ఈ ఆర్టికల్లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహన కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.


