Wednesday, October 14, 2026 07:02 PM
Wednesday, October 14, 2026 07:02 PM

రీల్‌లో జయమ్మ.. రియల్‌లో అన్నపూర్ణ: 400 కుటుంబాలకు రష్మిక అండ

ప్రముఖ నటి రష్మిక మందన్న ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ పేరుతో పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించే సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన రాబోయే చిత్రం ‘రణబాలి’లో పోషించిన జయమ్మ పాత్ర స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 400 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడం ద్వారా వారి జీవన వ్యయాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

Also Read : బాబు బాటలో విజయ్‌.. తమిళనాడులో రచ్చ రచ్చ

హైదరాబాద్, మహబూబ్‌నగర్, అనంతపురం, విజయవాడ, బెంగళూరు, కొచ్చి, చెన్నై, కొడగు ప్రాంతాల్లోని 400 పేద కుటుంబాలకు రష్మిక ఈ సాయం అందిస్తున్నారు. ఎంపిక చేసిన కుటుంబాలకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకుల ఖర్చును స్వయంగా భరించనున్నట్లు ప్రకటించారు. ఒక్కో కిట్‌లో 75 కిలోల బియ్యంతో పాటు గోధుమ పిండి, పప్పులు, వంట నూనె, టీ పొడి తదితర ఆహార పదార్థాలను అందిస్తున్నారు.

గతంలో చేపట్టిన సేవా కార్యక్రమాలను ప్రచారం చేసుకోలేదని, అయితే మరికొందరిని సామాజిక సేవ దిశగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమ వివరాలను అందరితో పంచుకున్నట్లు రష్మిక వెల్లడించారు. ఈ సహాయాన్ని ఒకేసారి అందించి ముగించకుండా, రాబోయే ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నిత్యావసరాలపై ఖర్చు తగ్గితే ఆయా కుటుంబాలు పిల్లల చదువులు, భవిష్యత్తు అవసరాల కోసం తమ ఆదాయాన్ని వినియోగించుకోగలవన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వివరించారు.

Also Read : ఏపీ బ్రాండ్ ఇమేజ్ సూపర్.. విజయవాడకు చైనా రాయబారి!

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’లో రష్మిక జయమ్మ పాత్రను పోషించారు. 1876–78 నాటి కరవు నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని జయమ్మ పాత్ర ఆలోచనలకు, తన వ్యక్తిత్వానికి దగ్గర పోలికలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఆ పాత్రలోని దయ, సేవాభావం ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’కు ప్రేరణగా నిలిచాయని, ప్రేక్షకులు తనపై చూపుతున్న ప్రేమకు ప్రతిగా సమాజానికి తోడ్పడాలని భావించినట్లు తెలిపారు.

సమాజానికి సాయం చేయడానికి పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యానికి అనుగుణంగా చిన్న ప్రయత్నంతో ముందుకు రావాలని రష్మిక పిలుపునిచ్చారు. వందలాది కుటుంబాలకు అండగా నిలుస్తున్న ఆమె చొరవను అభిమానులు, సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. అక్టోబర్ 15న విడుదల కానున్న ‘రణబాలి’ విజయాన్ని ఆకాంక్షిస్తున్న అభిమానులు, జయమ్మ పాత్ర స్ఫూర్తితో ఆమె చేపట్టిన ఈ సేవా కార్యక్రమం మరింత మందిని సామాజిక బాధ్యత వైపు ప్రోత్సహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

వైసీపీలో జగన్ ముందు...

“పార్టీ కోసం నిలబడేది ఎవరు..? పదవుల...

హైదరాబాద్ టీ20 ముంగిట...

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న...

ఏపీ బ్రాండ్ ఇమేజ్...

నవ్యాంధ్ర రాజధాని అమరావతి, చారిత్రక నగరమైన...

జగన్ కు మ్యూజిక్...

వైఎస్సార్‌సీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్...

రాహుల్ దెబ్బ.. కేంద్రంలో...

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు...

ఫ్యాక్షన్ గడ్డపై సతీమణుల...

రాయలసీమ రాజకీయాల్లో ఎప్పుడూ అత్యంత వేడి...

పోల్స్