నవ్యాంధ్ర రాజధాని అమరావతి, చారిత్రక నగరమైన విజయవాడ కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు సమర్థవంతమైన పాలన, దౌత్యపరమైన అనుభవం వల్ల రాష్ట్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. అక్టోబర్ 16 నుండి 18 వరకు అత్యంత వైభవంగా జరగనున్న విజయవాడ ఉత్సవ్ 2.0′ వేడుకలకు భారత్లోని చైనా రాయబారి హెచ్.ఇ. శ్రీ జు ఫేయిహాంగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
Also Read : జగన్ కు మ్యూజిక్ స్టార్ట్ అయిందా..?
ఈ వేడుకలకు రావాల్సిందిగా సీఎం చంద్రబాబు చేసిన ఆహ్వానాన్ని చైనా రాయబారి సంతోషంగా అంగీకరించారు. ఈ మేరకు అక్టోబర్ 13, 2026 నాడే ఆయన అధికారికంగా లేఖ ద్వారా తన అంగీకారాన్ని తెలిపారు. తన సతీమణి టన్ యుక్సియుతో కలిసి విజయవాడకు వస్తున్నట్లు ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఇది నిదర్శనం.
Also Read : సౌదీ అరామ్కోపై హౌతీల మిస్సైల్ దాడి.. భారత్ కు చుక్కలేనా..?
భారతదేశం, చైనాలు అత్యంత ప్రాచీన నాగరికతలు కలిగి ఉన్నాయని, రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు, ప్రజల మధ్య పరస్పర మార్పిడి ఎంతో ముఖ్యమని చైనా రాయబారి తన లేఖలో ప్రశంసించారు. ఏపీలో సీఎం చంద్రబాబును కలిసి, ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించే మార్గాలపై చర్చిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పరిణామం రాష్ట్ర పర్యాటక రంగానికి, అంతర్జాతీయ సంబంధాలకు ఎంతో ఊపునిస్తుందని చెప్పవచ్చు.
Also Read : వివేకా కేసులో.. వచ్చే వారం నుంచి కీలక అరెస్టులు..?
అక్టోబర్ 16 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలు విజయవాడ చరిత్రలోనే మైలురాయిగా నిలవనున్నాయి. రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలను, గొప్ప వైవిధ్యాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకువెళ్లేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఒక అంతర్జాతీయ స్థాయి దౌత్యవేత్త రాష్ట్ర వేడుకలకు వస్తుండటం కూటమి ప్రభుత్వ దౌత్య విజయానికి, ఏపీ బ్రాండ్ ఇమేజ్కు గర్వకారణం.


