Saturday, October 10, 2026 08:31 PM
Saturday, October 10, 2026 08:31 PM

ఓటమిపై గంభీర్ షాకింగ్ కామెంట్స్..!

భారత్, వెస్టిండీస్ మధ్య రాంచీలో జరిగిన రెండో టీ20 మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందించినా, టీమిండియాకు మాత్రం కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్, సంజూ శాంసన్ (84), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మల మెరుపులతో 5 వికెట్ల నష్టానికి 249 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే ఇంతపెద్ద టార్గెట్‌ను సైతం మన బౌలర్లు కాపాడుకోలేకపోయారు. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ (102 నాటౌట్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (84) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో కేవలం 18.3 ఓవర్లలోనే విండీస్ ఈ రికార్డు లక్ష్యాన్ని ఛేదించి, 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Also Read : లోకల్ వార్.. మరో ప్రయోగానికి టీడీపీ ప్లానింగ్..!

ఈ ఘోర పరాజయం తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వచ్చిన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఓటమికి ఎవరిని నిందించాలనే ప్రశ్నకు తనదైన శైలిలో ధైర్యంగా సమాధానమిచ్చారు. మ్యాచ్ మధ్యలో యువ బౌలర్ మయాంక్ యాదవ్ ఒక కీలక క్యాచ్ జారవిడవడంపై గంభీర్ స్పందిస్తూ.. టాస్ గెలవడం మన చేతుల్లో ఉండదు. మ్యాచ్‌లో క్యాచ్‌లు డ్రాప్ అవ్వడం సహజం. గతంలోనూ జరిగాయి, భవిష్యత్తులోనూ జరుగుతాయి. ఎవరూ కావాలని క్యాచ్‌లు వదిలేయరు, కాబట్టి ఈ ఓటమికి ఎవరినీ వ్యక్తిగతంగా నిందించలేం అని ఆటగాళ్లకు అండగా నిలిచాడు.

Also Read : బ్రేకింగ్: రెండు రోజుల్లో పవన్ – విజయ్ భేటీ..!

కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే అనుకూలిస్తూ, భారీగా పరుగుల వరద పారే ఫ్లాట్ పిచ్‌లపై గంభీర్ ఆందోళన వ్యక్తం చేశాడు. క్రికెట్‌లో కేవలం ఫోర్లు, సిక్సర్లు మాత్రమే చూడాలనుకుంటే కుదరదని, బ్యాట్, బాల్ మధ్య సమానమైన పోటీ ఉండాలని డిమాండ్ చేశారు. “బౌలర్లు కూడా మన దేశ ఆటగాళ్లే, ఎంతో కష్టపడి ఈ డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్నారు. ఇలాంటి పిచ్‌ల వల్ల వారి కెరీర్లు కూడా ప్రమాదంలో పడతాయి” అని గంభీర్ బౌలర్ల పట్ల సానుభూతి వ్యక్తంచేశాడు. టాస్ ఓడిపోవడం, మ్యాచ్‌లో విపరీతంగా కురిసిన మంచు కారణంగా బౌలింగ్ చేయడం కష్టంగా మారిన మాట వాస్తవమే అయినా.. ప్రణాళికలను సరిగ్గా అమలు చేయడంలో తాము విఫలమయ్యామని గంభీర్ అంగీకరించాడు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

బ్రేకింగ్: రెండు రోజుల్లో...

దక్షిణాది రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న...

బీసీ రిజర్వేషన్లపై ఏపీ...

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక...

జగన్ అక్రమాస్తుల కేసుల్లో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల...

తిరుమల నడక దారి...

తిరుమల కొండకు కాలిబాటన వచ్చే భక్తుల...

సచివాలయ ఉద్యోగుల గుండెల్లో...

ఇటీవల విజయవాడలో ఆందోళన నిర్వహించిన గ్రామ,...

విశాఖ బ్రాండ్ మార్పు.....

హైదరాబాద్‌కు సైబరాబాద్ ఉన్నట్లు విశాఖకు ఇప్పుడు...

పోల్స్