వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. జగన్ మోహన్ రెడ్డితో పాటు ఇతరులపై ఉన్న మనీ లాండరింగ్ కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసులను రోజువారీ ప్రాతిపదికన విచారించి, వీలైనంత త్వరగా తుది తీర్పులు వెలువరించాలని కోర్టును అభ్యర్థించింది.
Also Read : రష్యాతో ట్రంప్ సంచలన డీల్.. పాపం ఉక్రెయిన్..!
ఈడీ దాఖలు చేసిన తాజా రిట్ పిటిషన్‌లో ఒక కీలక డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న మిగతా 73 మందిని కూడా హైదరాబాద్ నాంపల్లిలోని ప్రత్యేక సీబీఐ కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరింది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ భద్రతా కారణాలు, అధికారిక బాధ్యతల దృష్ట్యా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపులు పొందగా, ఇప్పుడు కేసుల విచారణ వేగవంతం కావాలంటే నిందితులు నేరుగా కోర్టుకు రావడం అవసరమని ఈడీ స్పష్టం చేసింది.
Also Read : తిరుమల నడక దారి భక్తులకు టీటీడీ వార్నింగ్..!
ఈ కేసుల విచారణలో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని ఈడీ తన పిటిషన్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించింది. నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో తాము దాఖలు చేసిన 9 ఈడీ చార్జ్‌షీట్లు గత పదేళ్లుగా ఎలాంటి ట్రయల్ ప్రారంభం కాకుండా పెండింగ్‌లోనే ఉండిపోయాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. నిందితులు వరుసగా డిస్చార్జ్ పిటిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారని పేర్కొంది. ఇలాంటి భారీ స్థాయి క్విడ్ ప్రో కో పెట్టుబడులు, కార్పొరేట్ అక్రమాలు మరియు ఆర్థిక నేరాలను కేవలం సాధారణ కేసులుగా చూడలేమని, ఇవి దేశ ఆర్థిక ఆరోగ్యానికే పెద్ద ముప్పు అని ఈడీ తన పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేసింది.


