Friday, September 4, 2026 08:32 PM
Friday, September 4, 2026 08:32 PM

బిగ్ బాస్ 10 ఫైనల్ లిస్ట్ ఇదే..!

ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో ‘బిగ్ బ్రదర్’ పేరుతో మొదలైన రియాలిటీ షో.. హిందీలో ‘బిగ్ బాస్’గా పరిచయమై దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత దాదాపు అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ రియాలిటీ షోలు తమదైన ముద్ర వేసుకున్నాయి. ఇక టాలీవుడ్ విషయానికొస్తే.. బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పేర్లు ప్రచారంలో ఉండగా.. తాజాగా మరో లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి అడుగుపెట్టబోయే ఫైనల్ కంటెస్టెంట్ల జాబితా అంటూ ప్రచారం జరుగుతోంది.

Also Read : కొండా సురేఖ సంచలన పోస్ట్.. ఏం చేస్తారో..!

సాధారణంగా ప్రతి సీజన్‌లోనూ సెలబ్రిటీలు, కామన్ పీపుల్స్ కలయికతో బిగ్ బాస్ హౌస్‌ను రూపొందిస్తుంటారు. అయితే ఈసారి మాత్రం కంటెస్టెంట్ల విషయంలో ఆసక్తికరమైన మార్పులు ఉండబోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఆరుగురు సెలబ్రిటీలు, ఆరుగురు కామన్ పీపుల్స్‌ను హౌస్‌లోకి పంపనున్నారని ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు ఏకంగా 10 మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామన్ పీపుల్స్ పాల్గొనబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా వైరల్ అవుతున్న సెలబ్రిటీ లిస్ట్‌పై బిగ్ బాస్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

వైరల్ అవుతున్న జాబితా ప్రకారం.. టెంపర్ వంశీ, దేబ్జానీ మోదక్, వర్షిణి సౌందరరాజన్, జబర్దస్త్ రాంప్రసాద్, పొట్టి నరేష్, ముఖేష్ గౌడ, చైత్ర రాయ్, ఆదిత్ ఈశ్వరన్, కృష్ణుడు, సుధీర్ వంటి పేర్లు బిగ్ బాస్ సీజన్ 10లో కనిపించబోతున్నారట. ఈ లిస్ట్‌లో సినీ నటులు, టెలివిజన్ ప్రముఖులు, కమెడియన్లు ఉండటం ఆసక్తికరంగా మారింది. విభిన్న నేపథ్యాలు, వ్యక్తిత్వాలు ఉన్న ఈ కంటెస్టెంట్లతో హౌస్‌లో మంచి డ్రామా ఉండే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇక కామన్ పీపుల్స్ కేటగిరీలో ఆరుగురిని తీసుకోనున్నారని, ఇప్పటికే ఝాన్సీ పేరు ఫైనల్ అయినట్లు ప్రచారం జరుగుతుండగా.. మిగిలిన ఐదుగురి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Also Read : భార్య దగ్గరకు విజయ్.. లండన్ టూర్ అందుకే అని టాక్..?

బిగ్ బాస్ తెలుగు పదో సీజన్ కావడంతో ఈసారి షోపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. హోస్ట్ నాగార్జున సైతం సీజన్‌పై ఆసక్తిని పెంచేలా వరుసగా ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా ‘10 రెట్ల వినోదం’ అంటూ విడుదలైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఊహించని డ్రామా, సర్‌ప్రైజ్‌లు, కొత్త తరహా టాస్క్‌లతో ఈసారి ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తామని బిగ్ బాస్ టీమ్ చెబుతోంది. మరి ప్రచారంలో ఉన్న ఈ కంటెస్టెంట్ల లిస్ట్‌లో ఎంతవరకు నిజం ఉంది? సీజన్ ప్రారంభమైన తర్వాత ఎవరు హౌస్‌లోకి అడుగుపెడతారు? ఈసారి బిగ్ బాస్ ఎలాంటి టీఆర్పీ రేటింగ్స్ సాధిస్తుందో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వివేకా హత్య కేసులో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,...

నేను సీఎం అవుతా.....

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రాంతీయ పార్టీ...

ఇంటింటికీ తెలుగుదేశం క్రేజీ...

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ప్రభుత్వం రెండేళ్ల...

జనంలోకి జగన్.. పాదయాత్ర...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పాదయాత్రల వేడి...

కొండా సురేఖ సంచలన...

తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ...

బొండా ఫ్యామిలీకి చంద్రబాబు...

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నగారా...

పోల్స్