Friday, August 28, 2026 12:28 PM
Friday, August 28, 2026 12:28 PM

మళ్ళీ తెరమీదకు బీసీ కార్డు.. పాత చరిత్ర మరిచిపోయావా రజనీ?

మాజీ మంత్రి విడదల రజనీ అప్పుడప్పుడు మీడియా ముందుకి వచ్చి సూక్తిముక్తావళి వినిపిస్తూ ఉంటుంది. వినేవాడుంటే.. అన్నసామెత తరహాలో ఆమె చెప్పేవి వింటే జనానికి కాలక్షేపానికి బాగానే ఉంటుంది కానీ బాధితులకు మాత్రం ఒళ్ళు మండిపోతుంటుంది. బీసీల అభ్యున్నతి కోసం కృషి చేసింది తామేనని.. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీల తలరాతను మార్చేశామని ఆమె చెబుతుంటే నవ్వొస్తుంది. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారంటూ.. 2024 ఎన్నికల ముందు ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి.

Also Read : ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎంట్రీ..!

అధికారం అండతో విడదల రజనీ, ఆమె మరిది చేసిన ఆగడాల గురించి చిలకలూరిపేట జనాన్ని అడిగితే పుంఖానుపుంఖానులుగా ఆమె అవినీతి చరిత్రను వల్లెవేస్తారు. 2019లో గెలిచి 2024లో ఓడిన మాజీ మంత్రి విడదల రజనీకి భవిష్యత్తుమీద బెంగ ఏర్పడింది. టీడీపీ నాటిన ఈ సైబరాబాద్ మొక్క టీడీపీ నుంచి వైసీపీలో చేరి తాను బిసి మహిళను అంటూ 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసి గెలుపొందారు. బీసీ వర్గంతో పాటుగా భర్త సామాజిక వర్గమైన కాపు ఓట్లను ఆమె సంపాదించుకున్నారు. 2024లో సీన్ రివర్స్ అయింది. బీసీ కార్డుతో గుంటూరు వెస్ట్ కు వెళ్లారు. అక్కడ టీడీపీ నుంచి మరో బీసీ మహిళా నేత గల్లా మాధవి చేతిలో ఘోరంగా ఓడిపోయారు విడదల రజినీ.

Also Read : ఆ ప్రశ్నలకు సాయిరెడ్డి దగ్గర జవాబు ఉందా..?

2024లో గుంటూరు వెస్ట్‌లో ఓటమి తరువాత తిరిగి చిలకలూరిపేటకు వచ్చారు రజినీ. మంత్రిగా ఉన్న సమయంలో చిలకలూరిపేటకు చెందిన ఎంతో మందిని మోసం చేసారని రజినీపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి.స్టోన్ క్రషర్ యజమానిని ఐదుకోట్లు డిమాండ్ చేసి వివాదంలో ఇరుక్కుపోయారు. ఈ కేసులో ఆమె మరిది గోపిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.ఆమెపై సొంత పార్టీ నేతలే జగన్ తెచ్చిన డిజిటల్ యాప్ లో ఫిర్యాదుచేశారు. టికెట్ ఇప్పిస్తానని కోట్లు కొట్టేసిన ఘనత ఆమెది. ఆమె అనుచరులయితే ఉద్యోగాలిప్పిస్తామని ఐదుకొట్లు కొట్టేశారు. ఇప్పటికీ ఆ కేసులు కోర్టుల్లో కొనసాగుతున్నాయి. పార్టీలో ఆమెకి మద్దతు ఇంచుమించు శూన్యంగా మారింది. ఆమె ఎక్కడినుంచి పోటీచేస్తారో.. అసలు ఆమెకి టికెట్ వస్తుందో రాదోనన్న డౌట్ ఏర్పడింది.

Also Read : తెలుగుదేశం పార్టీకి కేంద్రం కీలక పదవి..!

ఈ నేపథ్యంలో రజనీ మళ్ళీ కులం కార్డు తెరమీదకి తెచ్చారు. మద్యం రవాణా స్కాంలో బినామీ కంపెనీ పేరుతో కోట్లు నొక్కేసిన మాజీ మంత్రి కారుమూరిని ఈడీ అరెస్ట్ చేసి జైలుకి పంపితే దానికి కులం మేకప్ అద్దింది.. విడదల రజనీ. కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకి దిగిందని… బీసీ వర్గానికి చెందిన నాయకులను టార్గెట్ చేస్తూ వరుస అరెస్టులకు పాల్పడుతున్నారంటూ కుల రాజకీయాలకు తెరమీదకి తెచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, విక్రయాలు ఎంతో పారదర్శకంగా జరిగాయంట. ఈమాట ఆమె చెబుతుంటే. మద్యం స్కాంలో అరెస్ట్ అయిన వైసీపీ కీలక నేతల్ని తలుచుకుని .. జనం నవ్వుకుంటున్నారు. 2029లో తాము అధికారంలోకి వచ్చేస్తామని.. బదులు తీర్చుకుంటామంటూ ఆమె తెగ ఆవేశపడుతోంది.

-జి.సత్యనారాయణరాజు

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సీఎం రేవంత్‌కు మంత్రి...

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా...

అమరావతిలో మళ్ళీ ల్యాండ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

గత రెండేళ్ళ నుంచి సంచలనంగా మారిన...

ఆ విషయంలో వైసీపీ...

కాలం కలిసి రాకపోతే తాడు కూడా...

తెలుగుదేశం పార్టీకి కేంద్రం...

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ సర్కార్‌లో...

దిల్ రాజుకు ఇతర...

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు...

పోల్స్