Saturday, August 29, 2026 01:20 PM
Saturday, August 29, 2026 01:20 PM

నైట్ క్లబ్ రచ్చ.. ఆ క్రికెటర్ కెరీర్ క్లోజ్..?

ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ నైట్‌క్లబ్ వివాదం సరికొత్త మలుపు తిరిగింది. డెర్బీ నగరంలోని ‘మొల్లీ మలోన్స్ ఐరిష్ టావెర్’ వెలుపల జరిగిన గొడవకు సంబంధించి కార్స్‌పై దాడి ఆరోపణలు రావడంతో డెర్బీషైర్ పోలీసులు అధికారికంగా విచారణ ప్రారంభించారు. గత శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో కార్స్‌ను పోలీసులు మొదట బేడీలు వేసి అదుపులోకి తీసుకున్నప్పటికీ, ఆ ప్రాంతం విడిచి వెళ్ళడానికి అంగీకరించడంతో ఆ తర్వాత వదిలిపెట్టారు.

Also Read : కేంద్రంపై విజయ్ మాల్యా సంచలన ఆరోపణలు..!

అయితే ఈ వివాదం తీవ్రం కావడంతో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు మరియు క్రికెట్ రెగ్యులేటర్ దీనిపై అంతర్గత విచారణను చేపట్టాయి. ఈ క్రమంలోనే గురువారం నుంచి పాకిస్తాన్‌తో ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ జట్టు నుండి కార్స్‌ను తక్షణమే తొలగించారు. ఈ ఘటన జరిగిన సమయంలో మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్, మాథ్యూ పాట్స్ కూడా అక్కడే ఉన్నట్లు ఫుటేజీలో కనిపించినా, ఈ దాడి ఆరోపణలతో వారికి ఎలాంటి సంబంధం లేదని తేలింది.

Also Read : నేపాల్ ప్రళయం.. భారత్‌కు భారీ వరద వస్తోందా..?

క్రికెటర్ల ఇలాంటి ప్రవర్తనపై ఇంగ్లాండ్ కొత్త టెస్ట్ కెప్టెన్ జో రూట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్స్ చేసిన పనికి తాను తీవ్ర ఆగ్రహంతో ఉన్నానని, అయితే అతను తన తప్పును తెలుసుకుని క్షమాపణలు చెప్పాడని రూట్ పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు దాడి కేసుపై ఎలాంటి అరెస్టులు చేయకుండా దర్యాప్తును కొనసాగిస్తుండటంతో, కార్స్ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు ఇప్పుడు ప్రమాదంలో పడింది. నైట్ క్లబ్ వివాదం తర్వాత బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SC, STలకు జగన్‌...

BCలనే కాదు..వైసీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీలను...

300 కోట్ల పెట్టుబడి.....

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడమే...

ఆసియా క్రీడల్లో క్రికెటర్లకు...

జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా వచ్చే నెల...

ఇలా అయితే ...

ఏ రాజకీయ పార్టీలో అయినా సరే.....

ఏపీ మున్సిపాలిటీలకు మహర్దశ.....

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, నగరాల రూపురేఖలను మార్చేలా...

సీఎం రేవంత్‌కు మంత్రి...

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా...

పోల్స్