Friday, October 24, 2025 02:15 PM
Friday, October 24, 2025 02:15 PM
roots

ఈరోజు (24-10-2025) రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయణం, శరదృతువు, బహుళ పక్షం 24-10-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం 24-10-2025

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

—————————————

వృషభం 24-10-2025

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూరప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి మరింత పెరుగుతుంది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. అవసరానికి చేతికి ధనం అందక ఇబ్బందిపడతారు. సంతానం విద్య ఉద్యోగ యత్నాలు మందగిస్తాయి.

—————————————

మిధునం 24-10-2025

ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. గౌరవ మర్యాదలకు లోటుండదు.

—————————————

కర్కాటకం 24-10-2025

బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలమవుతాయి. వ్యాపార విస్తరణకు కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. చిన్ననాటి మిత్రులతో దైవ క్షేత్రాలు దర్శించుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

—————————————

సింహం 24-10-2025

వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగమున ఊహించని సమస్యలు ఎదురవుతాయి. సన్నిహితులతో వివాదాలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు.

—————————————

కన్య 24-10-2025

వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. దూరప్రయాణాల వలన శారీరక శ్రమ అధికమవుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

—————————————

తుల 24-10-2025

సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.

—————————————

వృశ్చికం 24-10-2025

వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి. మిత్రులతో సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఇంటాబయట సమస్యలు కొంత బాధిస్తాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో వివాదాలు పరిష్కారమౌతాయి. రుణదాతల నుండి ఒత్తిడులు అధికమౌతాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి.

—————————————

ధనస్సు 24-10-2025

వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి. సమాజంలో పరిచయాలు విస్తృతమౌతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమించి ముందుకు సాగుతారు. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

—————————————

మకరం 24-10-2025

మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు అధికమవుతాయి. వ్యాపారాలు ముందుకు సాగక చికాకులు అధికమవుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

—————————————

కుంభం 24-10-2025

ఇంటా బయట చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు ఉంటాయి.

—————————————

మీనం 24-10-2025

భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పనులు ప్రారంభిస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్థులకు నూతన పెట్టుబడులు అందుతాయి. విందువినోద కార్యక్రమాలకు హాజరు అవుతారు. ఉద్యోగాలలో మీ నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు.

—————————————

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

కొలికపూడి శ్రీనివాస్ సస్పెన్షన్...

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు...

కంపెనీ ట్రిప్ కోసం...

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు...

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

కొలికపూడి వర్సెస్ కేసినేని.....

తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు...

త్వరలో మంత్రివర్గంలో భారీ...

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి సరిగ్గా...

బ్రేకింగ్: తుని ఘటనలో...

గత రెండు రోజుల నుంచి అత్యంత...

పోల్స్