Thursday, October 23, 2025 07:38 PM
Thursday, October 23, 2025 07:38 PM
roots

షాకింగ్: అమెరికా పౌరసత్వం వదులుకుంటున్న అమెరికన్లు..!

అమెరికా పౌరసత్వం కోసం ఎందరో ఎదురు చూస్తూ ఉంటారు. పలు దేశాల నుంచి ఆ దేశానికి వెళ్లి స్థిరపడి, అక్కడి పౌరులుగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. మన భారత్ నుంచి ఎన్నో లక్షల మంది దేశ పౌరసత్వం వదులుకున్నారు. కానీ తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం.. అమెరికా పౌరసత్వాన్ని అమెరికా పౌరులు వద్దు అనుకోవడం సంచలనంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అమెరికన్ పౌరులు కావాలని కలలు కంటుండగా, విదేశాలలో నివసిస్తున్న అమెరికన్ పౌరుల సంఖ్య పెరుగుతోంది.

Also Read : దానం చుట్టూ మరో వివాదం..!

కేవలం పన్ను లేదా చట్టపరమైన కారణాల వల్ల మాత్రమే కాదు, దేశ రాజకీయ పరిస్థితిపై నిరాశ, రాజకీయ అసంతృప్తి, ఇప్పుడు ప్రధాన కారణంగా మారిందని తెలుస్తోంది. 2025లో నిర్వహించిన సర్వేలో దాదాపు సగం మంది అమెరికా పౌరసత్వం వదులుకోవడానికి సిద్దంగా ఉన్నారని వెల్లడి అయింది. దేశంలో పెరుగుతున్న అల్లర్లు, తుపాకీ హింస, ఓటింగ్ హక్కుల విషయంలో తలెత్తుతున్న సమస్యలు ఇవన్నీ అక్కడి ప్రజలకు చికాకుగా మారాయి. ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత చాలా మంది అమెరికాను వీడారట. వీరిలో ఎక్కువ మంది బ్రిటన్ లేదా కెనడా, అలాగే యూరప్ దేశాల్లో ఉండటానికి ఆసక్తి చూపిస్తున్నారని సర్వేలో వెల్లడి అయింది.

Also Read : దుబాయ్ లో పెట్టుబడుల వేట మొదలుపెట్టిన ఏపి సిఈఓ చంద్రబాబు

ది వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరం 5,000 నుండి 6,000 మంది అమెరికన్లు తమ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. రాజకీయ తీవ్రవాదం పెరగడం, ఓటింగ్ హక్కులకు ముప్పు, సామూహిక కాల్పులు ఇవన్నీ అక్కడి ప్రజలకు తలనొప్పిగా మారాయి. ఇక జనవరి 6 న రాజధానిలో జరిగిన అల్లర్ల తర్వాత కూడా చాలా మంది దేశాన్ని వీడాలి అనుకున్నారట. విదేశాల్లో ఉన్న చాలా మంది అమెరిక పౌరులు తాము అమెరికన్ అని చెప్పుకోవడానికి గర్వపడే వారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సర్వేలో వెల్లడి అయింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

కొలికపూడి వర్సెస్ కేసినేని.....

తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు...

త్వరలో మంత్రివర్గంలో భారీ...

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి సరిగ్గా...

బ్రేకింగ్: తుని ఘటనలో...

గత రెండు రోజుల నుంచి అత్యంత...

దానం చుట్టూ మరో...

దానం నాగేందర్.. తొలి నుంచి వివాదాలు...

నా తండ్రికి ఆమె...

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రోజు...

పోల్స్