భారత క్రికెట్ జట్టులో సెలక్షన్ పై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కొందరు ఆటగాళ్లను వెనకేసుకు రావడం పై అభిమానులు మండిపడుతున్నారు. ముఖ్యంగా బౌలింగ్ విభాగం విషయంలో కోచ్ గంభీర్ వ్యవహరిస్తున్న శైలిపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా ఫెయిల్ అయిన ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రానాను వన్డే జట్టుకు ఎంపిక చేయడంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా గంభీర్ పై విమర్శలు చేస్తున్నారు. ఇంగ్లాండ్ పర్యటనకు కూడా ఇదే తరహాలో అతన్ని ఎంపిక చేశారు.
Also Read : శ్రీలేఖకు టీడీపీ క్యాడర్ మద్దతు.. ప్రభుత్వంపై విమర్శలు
అయితే విమర్శలు రావడంతో పక్కన పెట్టింది టీం యాజమాన్యం. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు అనుభవం లేని హర్షిత్ రానా ను ఎంపిక చేయడంపై మరోసారి విమర్శలు వస్తున్నాయి. మహమ్మద్ షమీ అందుబాటులో ఉన్నా సరే అతనిని పక్కనపెట్టి.. సీనియర్ బౌలర్ బూమ్రా లేని సమయంలో హర్షిత్ రానా ను జట్టులోకి తీసుకున్నారు. అతని బౌలింగ్ లో వేగం ఉంది కానీ పదును లేదు అనే విమర్శలు వచ్చాయి. ఇటీవల ఆసియా కప్ లో కూడా అతనిని ఎంపిక చేశారు. మూడు ఫార్మాట్లకు ఆడుతున్న ఏకైక బౌలర్ అతను ఒక్కడే. ఫెయిలవుతున్న సరే పదేపదే అవకాశాలు ఇవ్వడం పట్ల.. గంభీర్ ను టార్గెట్ చేస్తున్నారు.
Also Read : వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఇటీవల హర్షిత్ రానాకు మద్దతుగా గంభీర్ మీడియా సమావేశంలో.. సోషల్ మీడియాపై ఫైర్ అయిన సందర్భం కూడా ఉంది. ఇక రానా కోసమే.. బూమ్రాను విండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆడించారని విమర్శలు వస్తున్నాయి. ఫాస్ట్ బౌలర్ల ప్రభావం లేని భారత పిచ్ లపై అతనిని ఆడించి.. ఆస్ట్రేలియా పర్యటనకు విశ్రాంతి కారణంగా పక్కన పెట్టారని.. విమర్శలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా మైదానాల్లో బూమ్రా అత్యంత కీలక బౌలర్. గత పర్యటనలో అతని ప్రభావం ఏ స్థాయిలో ఉందో అందరూ చూశారు. కానీ ఇప్పుడు అతనిని పక్కనపెట్టి రానాకు అవకాశం ఇవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బూమ్రా సంగతి తెలిసి కూడా.. నామమాత్రపు సిరీస్ లో అతనిని ఏవిధంగా ఆడిస్తారంటూ.. అసహనం వ్యక్తం చేస్తున్నారు.




