ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సామాజిక వర్గాల మధ్య విభేదాలు శాసించడం అనేది దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య విభేదాలు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులు.. ఏం జరిగినా సరే.. కమ్మ సామాజిక వర్గం వారిని, టీడీపీని దోషిగా చూడటం, సిఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కందుకూరు వ్యవహారంలో కూడా అదే దాదాపుగా జరిగే అవకాశాలు కనిపించాయి.
Also Read : పాకిస్తాన్ కు కెలకడం అలావాటు.. మనకు గెలవడం అలవాటు..!
కందుకూరు వ్యవహారాన్ని చంద్రబాబుకు, కమ్మ సామాజిక వర్గానికి ఆపాదిస్తూ విమర్శలు చేసారు. వైసీపీకి అనుకూలంగా ఉండే కొందరు ఈ వ్యవహారాన్ని మరింత పెద్దది చేసే ప్రయత్నం చేసారు. అయితే ఇక్కడ జనసేన కార్యకర్తలు, కాపు సామాజిక వర్గ నాయకులు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసారు. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవను కులాలకు ఆపాదిస్తోన్న అంశంపై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు కాపులకు అన్యాయం ఏ విధంగా జరుగుతుందని కొందరు ప్రశ్నించారు.
Also Read: ప్రాణాలు కోల్పోయిన యువ క్రికెటర్లు..!
అవకాశం దొరికితే విమర్శలు చేసే కొందరు.. ఈ విషయంలో సామాజిక వర్గాలను తీసుకు రావడం తప్పు అంటూ ఫైర్ అయ్యారు. కళ్యాణ్ దిలీప్ సుంకర వంటి వాళ్ళు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా మాట్లాడటం గమనార్హం. అతని వీడియో కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గతంలో వైసీపీకి అనుకూలంగా ఉండే కాపు సామాజిక వర్గ విశ్లేషకులు సైతం ఈ విషయంలో వైసీపీని విమర్శించడం వంటివి జరిగాయి.
Also Read : పాక్ ఏడుపు అందుకే.. ఆఫ్ఘన్ మాజీ ఎంపీ సంచలన కామెంట్స్..!
గతంలో తాము నష్టపోయామని, పవన్ రూపంలో తమకు గౌరవం ధక్కుతోందని కామెంట్స్ చేయడం జరిగాయి. చంద్రబాబు, పవన్ కలిసి ఉండటం జీర్ణించుకోలేని వైసీపీ ఈ తరహా గొడవలకు శ్రీకారం చుడుతోందని, దీనిని తాము కులాల గొడవలుగా చూడట్లేదని గోదావరి ప్రాంతానికి చెందిన కాపులు సైతం సోషల్ మీడియా కామెంట్ చేయడంతో వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఈ గొడవల్లో చలి కాచుకునే ప్రయత్నం చేసిన కొందరు సైతం మౌనంగానే ఉండటం గమనార్హం.