గంజాయి.. గత 5 ఏళ్ళుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినపడుతోన్న మాట. గత 5 ఏళ్ళలో.. గంజాయి దేశంలో ఎక్కడ దొరికినా సరే ఏపీ మాట వినపడేది. అప్పట్లో రాజకీయ నాయకులు సైతం గంజాయి వ్యాపారం చేసే వారు అనే ఆరోపణలు బలంగా వినపడిన పరిస్థితి. ఓ డీజీపీ తన పదవి కోల్పోవడానికి గంజాయి కూడా అప్పట్లో కారణం అయింది అనే కామెంట్స్ సైతం చూసాం. ఇక ఇప్పుడు ప్రభుత్వం మారడంతో గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపే పరిస్థితి. గంజాయిని ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుంది.
Also Read : జగన్ పై లేని కోపం బాలయ్యపై ఎందుకో..? అప్పుడు మెగా ఫ్యాన్స్ పౌరుషం ఏమైంది..?
సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో గంజాయిని అరికట్టేందుకు పోలీసు శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అటు తెలంగాణా పోలీసులతో కూడా కలిసి ఏపీ పోలీసులు ఈ విషయంలో దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ చేసిన కామెంట్స్ దీనికి నిదర్శనం అనే చెప్పాలి. గంజాయి రవాణా చేసినా, గంజాయి తాగి పిచ్చి చేష్టలు చేసినా కాల్చి పారేస్తాం అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. అటు తెలంగాణా పోలీసులు సైతం గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Also Read : కూటమికి నచ్చేసిన పేర్ని నానీ.. ఒక్క కామెంట్ తో ఫిదా..!
సిఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో సీరియస్ గా ఫోకస్ చేయడంతో.. తెలంగాణా పోలీసులు కూడా కఠిన చర్యలకు దిగుతున్నారు. తాజాగా రాచకొండ పరిధిలో భారీగా గంజాయి పట్టుకున్నారు. 1,100 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. డీసీఎం వాహనంలో సిమెంట్ బ్యాగుల మధ్యలో గంజాయి తరలిస్తున్న విషయాన్ని పోలీసులు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. సిమెంట్ లారీకి ముందు ఎస్కార్ట్‌ను పెట్టి పోలీసులు ఉంటే లారీ డ్రైవర్‌కు సమాచారం ఇచ్చేలా ఏర్పాటు చేసుకోగా.. పక్కా సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు ఏపీ, తెలంగాణా సరిహద్దుల్లో కూడా రెండు రాష్ట్రాల పోలీసులు సీరియస్ గా గంజాయిపై ఫోకస్ పెట్టారు.