రాజకీయాల్లో సోషల్ మీడియా అడుగు పెట్టిన తర్వాత.. పరిస్థితి అత్యంత ఇబ్బందికరంగా మారిన మాట వాస్తవం. వయసు, లింగ, పదవి ఈ భేదాలు, గౌరవాలు ఏమీ లేకుండా సోషల్ మీడియా వేదికగా చేసే విమర్శలు అత్యంత ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ చికాకుగా ఉంటాయి. మహిళలు అనే గౌరవం లేకుండా వారి వ్యక్తిగత జీవితాలను సైతం టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీరిపై ఏపీ పోలీసులు గురి పెట్టారు.
Also Read : లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం.. ఎంపీ గారికి బెయిల్.. వాళ్ళకు కష్టమేనా..?
తాజాగా మైలవరం వైసీపీ ఇంచార్జ్ కోమటి కోటేశ్వరరావు ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ స్థాయి నాయకుడిని అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఎమ్మెల్యేలు బాలకృష్ణ, వసంత కృష్ణ ప్రసాద్ పై చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేసారు. మైలవరం నియోజకవర్గంలో తాజాగా మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేసారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నందుకు గానూ.. వారిలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read : జగనన్నా.. మాకు కూడా న్యాయం చేయండి..!
మిగిలిన ఐదుగురు పరారీలో ఉన్నట్టు గుర్తించారు. కొందరు ఇతర రాష్ట్రాలకు పారిపోవడంతో వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కంచికచర్లలో 9 మంది వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసారు. మోగులూరులో టీడీపీ వర్గీయులపై వైసీపీ సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టడంతో కేసులు నమోదు చేసారు. అసభ్యకర పోస్టులు పెట్టడంతో టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసారు. నలుగురిని కోర్ట్ లో హాజరు పరచగా వారికి రిమాండ్ విధించింది కోర్ట్.