Monday, October 20, 2025 07:38 AM
Monday, October 20, 2025 07:38 AM
roots

కూటమికి నచ్చేసిన పేర్ని నానీ.. ఒక్క కామెంట్ తో ఫిదా..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నానీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వైసీపీ అధికారంలో ఉన్నా, కోల్పోయినా ఆయన మాట్లాడే మాటలకు మీడియాలో మంచి వెయిట్ ఉంటుంది. పదే పదే మీడియాలో కనపడే ఈ మాజీ మంత్రి వర్యులు.. టీడీపీ, జనసేనలపై చేసే వ్యాఖ్యలు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన కాస్త హైపర్ యాక్టివ్. పవన్ నాయుడు అంటూ అప్పట్లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ వైరల్ అవుతాయి.

Also Read : హైదరాబాద్ పోలీసుల మరో సంచలనం

వైసీపీ కంటే వైఎస్ జగన్ కు ఆయన నమ్మిన బంటు. అందుకే పార్టీలో నానీకి ఓ రేంజ్ లో వెయిట్ ఉంటుంది. అలాంటి నానీ తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన ఓ కామెంట్ ఓ రేంజ్ లో వైరల్ అయింది. సిఎం చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి నానీ ఆ ఇంటర్వ్యూలో వైసీపీ కార్యకర్తలు కంగు తినే.. కూటమి కార్యకర్తలు ఫిదా అయ్యే కామెంట్ చేసారు. చంద్రబాబును పవన్ కళ్యాణ్ ను విడగొట్టడం అనేది ఎవరి తరం కాదన్నారు నానీ.. మోడీకి గానీ వైసీపీకి గాని అది సాధ్యమయ్యే పని కాదన్నారు నానీ.

Also Read : జగనన్నా.. మాకు కూడా న్యాయం చేయండి..!

ఎవరు ఏం చేసినా సరే వాళ్ళు ఇద్దరూ కలిసే ఉంటారని, విడిపోయే అవకాశమే లేదన్నారు నానీ. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తున్నాయి. నానీ.. తమ బాస్ జగన్ కు నిద్రలేని మాట చెప్పారని, వైసీపీ మైండ్ గేమ్స్ కు టైం అయిపోయిందని నానీ గ్రహించారు అంటూ కూటమి కార్యకర్తలు కామెంట్ చేస్తున్నారు. ఇక మాస్ ఎలివేషన్ అంటూ సినిమా ఫ్యాన్స్.. కేజిఎఫ్ సినిమా మ్యూజిక్ తో వైరల్ చేస్తున్నారు. నానీ మనాడు కాకపోయినా మనకు నచ్చే మాట చెప్పాడు అంటూ.. కొనియాడుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్