Monday, October 20, 2025 11:12 AM
Monday, October 20, 2025 11:12 AM
roots

గుడివాడకి బైబై చెప్పిన కొడాలి..!

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాజీ మంత్రి కొడాలి నాని ఏ రేంజ్ లో ప్రత్యర్థులపై విమర్శలు చేసేవారో అందరికీ అవగాహన ఉంది. ముఖ్యంగా టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం పై ఆయన చేసిన విమర్శలు అప్పట్లో వివాదాస్పదమైన సందర్భాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు వ్యక్తిగత జీవితాన్ని కూడా కొడాలి నాని టార్గెట్ చేసిన సందర్భాలు కూడా చూసాం. ఇక వైసీపీలో కూడా ఆయనకు మంచి ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయింది.. కొడాలి నాని అప్పటినుంచి కనుమరుగయ్యారు.

Also Read : లిమిట్స్ లో ఉండు.. సజ్జలకు మాజీ మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

ఆయన ఎక్కడుంటున్నారు ఏం చేస్తున్నారు అనే సమాచారం పెద్దగా మీడియాకు కూడా రావడం లేదు. నాలుగు నెలల క్రితం గుండెకు ఆపరేషన్ చేయించుకున్న విషయం మీడియాలో బాగా హైలెట్ అయింది. అయితే ఇప్పుడు ఆయన పార్టీ నాయకులకు కూడా అందుబాటులో ఉండటం లేదంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. జిల్లా స్థాయి నాయకులు గానీ రాష్ట్రస్థాయి నాయకులు గానీ ఆయనకు ఫోన్ చేసిన పెద్దగా రియాక్ట్ కావడం లేదట. ఇటీవల పార్టీ కీలక సమావేశం జరగగా అక్కడ కూడా కొడాలి నాని అంతా ఆసక్తి చూపించలేదని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

Also Read : జగనన్నా.. మాకు కూడా న్యాయం చేయండి..!

తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని.. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, రాజకీయాల్లో ఎక్కువకాలం కొనసాగలేనని సన్నిహితుల వద్ద కొడాలి నాని వ్యాఖ్యలు చేసినట్లు గుడివాడ వైసిపి వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం తాను తన కుమార్తెల భవిష్యత్తుపై దృష్టి పెట్టానని.. గుడివాడ లో కూడా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకపోవచ్చు అని నాని చెప్పారట. ఇదే విషయాన్ని పార్టీ నాయకత్వానికి కూడా కొడాలి నాని ఇటీవల చెప్పినట్లు సమాచారం. ఇక గుడివాడకు కొత్త ఇన్చార్జ్ ను వెతుక్కోవాలని కూడా నాని స్పష్టం చేశారట. ఇటీవల పార్టీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా సన్నిహితులతో కూడా కొడాలి నాని పెద్దగా మాట్లాడలేదు అంటున్నాయి రాజకీయ వర్గాలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్