మనుషులు ప్రస్తుతం వస్తువులు వాడుకోవటం బాగా అలవాటు పడిపోయారు. ప్రతి చిన్న విషయానికి కూడా సాంకేతికపైన ఆధారపడుతున్నారు. చిన్న నోటి లెక్కకు కూడా క్యాలిక్‌లేటర్ తీస్తున్నారు. ఇక వీధి చివర్లో ఉన్న హోటల్‌కు వెళ్లటానికి కూడా ఓపిక లేక ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు. చివరికి ఉప్పు, పప్పు కోసం ఆన్‌లైన్ పోర్టర్‌ల మీద ఆధారపడే పరిస్థితికి చేరుకున్నారు. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా అన్ని పనులు చేస్తున్నారు.
Also Read : హైదరాబాద్ పోలీసుల మరో సంచలనం
గతంలో ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్లాలంటే.. సొంత వాహనం లేదా.. రిక్షా, ఆటో, సిటీ బస్సుల్లో మాత్రమే ప్రయాణం చేసే వాళ్లు. అయితే వాటి కోసం కూడా మెయిన్ రోడ్డు వరకు నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. అలా వెళ్లకుండా ఇంటి ముందుకే ఆటో, బైక్ వచ్చేలా ర్యాపిడో, ఓలా, ఊబర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు మునిసిపల్ స్థాయి నగరాల్లో కూడా ప్రస్తుతం ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఒకచోట నుంచి మరో చోటుకు చిన్న పాటి పార్సిల్‌ను కూడా ఈ సంస్థలు చేరవేస్తున్నాయి. దీని వల్ల సమయం ఆదా అవుతుందనేది సంస్థల మాట.
ఉద్యోగులు, ఇతర ప్రాంతాలకు వివిధ పనుల మీద వచ్చిన వారికి ఈ యాప్‌లు ఎంతో సౌకర్యంగా ఉన్నాయి. కానీ కొందరు చేస్తున్న వింత పనులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఓ నెల రోజుల క్రితం జైపూర్‌లో ఓ మహిళ ఓలా యాప్ ద్వారా బైక్ బుక్ చేసింది. తాను ఉన్న చోటు నుంచి కేవలం 750 మీటర్ల దూరంలోని తన ఇంటికి వెళ్లడానికి బైక్ బుక్ చేసుకుంది. ఎందుకిలా అని రైడర్ అడిగితే.. దారిలో కుక్కలు బాగా ఉన్నాయి.. అందుకే ఇలా బైక్ బుక్ చేసినట్లు జవాబిచ్చింది. అప్పట్లో ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అయ్యింది.
Also Read : గుడివాడకి బైబై చెప్పిన కొడాలి..!
తాజాగా ముంబైలో ఓ వ్యక్తి పార్శిల్ డెలివరి అంటు ర్యాపిడో బుక్ చేశాడు. తీరా రైడర్ వచ్చిన తర్వాత చేతిలో ఓ నల్ల సంచి పెట్టాడు. ఇదేమిటి అని రైడర్ అడిగితే.. బుక్ చేసుకున్న వ్యక్తి షాకింగ్ జవాబిచ్చాడు. ఇది చెత్త అని.. పక్కనే ఉన్న డస్ట్ బిన్‌లో పడేయ్యాలని చెప్పాడు. ఇందుకు ఎంత తీసుకుంటారని కూడా కోరాడు. చెత్త కవర్ కోసం ర్యాపిడో బుక్ చేశావా అని రైడర్ షాక్ అయ్యాడు. నేను తీసుకెళ్లేది లేదని చెప్పడంతో.. ఎక్స్ స్ట్రా తీసుకో అని పే చేశాడు.
ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్‌గా మారింది. చెత్త పారేయటానికి కూడా ఓపిక లేదా మీకు.. అని సెటైర్లు వేస్తున్నారు. మరీ ఇంత బద్ధకంతో ఉన్నారేంట్రా బాబు అంటున్నారు. మరి కొందరైతే.. ఆ కవర్‌లో చెత్తతో పాటు మరేమైనా ఉంటే.. అప్పుడు రైడర్ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మాదకద్రవ్యాలు, పేలుడు పదార్ధాలతో పాటు మనుషులను చంపేసి ఇలా పార్సిల్ చేసి బైక్ బుక్ చేసి పడేయ్యమని చెబితే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా బుక్ చేసిన వ్యక్తిపై కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.