ఏపీ రాజధాని అమరావతికి కొత్త కళ వచ్చింది. ఐదేళ్ల పాటు ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. జంగిల్ క్లియరెన్స్ పనులను గతేడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసిన అధికారులు.. ఈ ఏడాది జనవరి నెల నుంచి అమరావతి పునర్ నిర్మాణ పనులు వేగవంతం చేశారు. ఇప్పటికే సీఆర్‌డీఏ రీజనల్ కార్యాలయం పనలు ముగింపు దశకు చేరుకున్నాయి. దసరా నాటికి కార్యాలయం ప్రారంభిస్తామంటున్నారు అధికారులు.
Also Read : లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం.. ఎంపీ గారికి బెయిల్.. వాళ్ళకు కష్టమేనా..?
ఇక అమరావతిలో నిర్మించిన ఏఐఎస్, ఐఏఎస్ అధికారుల అధికారిక నివాస సముదాయాలు కూడా పూర్తయ్యాయి. వీటికి కూడా త్వరలోనే ముహుర్తం ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం మునిసిపల్ శాఖ మంత్రి నారాయమ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఆయన స్వదేశానికి వచ్చిన వెంటనే ఈ భవనాలు పరిశీలించి వాటి ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలుస్తోంది. మరోవైపు అమరావతిలో సీఎం చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే తొలి అంతస్తు నిర్మాణం కూడా పూర్తి చేసినట్లు సమాచారం. ఇక ఈ దసరా పండుగ నాడు మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా తన సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఇంటి సమీపంలోనే నారాయణ కూడా సుమారు 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకుంటున్నట్లు సమాచారం. ఈ ఇంటిని రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్మాణ సంస్థను మంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది.
Also Read : కోస్తా చేసిన పాపం ఏంటీ..? కులాల కుంపట్ల రాజకీయాలేనా..?
తాజాగా అమరావతికి కేంద్రం తీపి కబురు చెప్పింది. రాజధాని అమరావతిలో ఒకేసారి 12 బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్కాబ్, కెనరా, యూబీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ కార్యాలయాలకు 25 సెంట్ల చొప్పున ఒకేచోట స్థలం కేటాయించారు. ఆప్కాబ్ 2 ఎకరాలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 3 ఎకరాల భూమి కేటాయించారు. ఆయా బ్యాంకుల కార్యాలయాల ద్వారా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.