Monday, October 20, 2025 08:29 PM
Monday, October 20, 2025 08:29 PM
roots

శబాష్ టీం ఇండియా..!

పహల్గామ్ దాడి తర్వాత భారత్ – పాకిస్థాన్ మధ్య ఉన్న కాస్త సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోయాయి. ఇక ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్ ఉగ్రవాదులను వాళ్ల సొంత గడ్డపైనే మట్టుబెట్టింది భారత వాయు సేన. భారత్ చేతుల్లో చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ పరిస్థితి చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా తయారైంది. అంతర్జాతీయ వేదికపై కూడా పాకిస్తాన్ పరువు పూర్తిగా పోయింది. దీనికి బదులు తీర్చుకుంటామని పెద్ద సవాల్ కూడా చేసింది పాక్ ప్రభుత్వం.

Also Read : మిడిల్ ఆర్డర్ లో తెలుగు ఛాంపియన్.. తిలక్ సూపర్ హిట్

సరే చూసుకుందాం.. నువ్వా – నేనా.. అని భారత్ కూడా ప్రతి సవాల్ చేసింది. ఈసారి ఆసియా కప్ వేదికగా భారత్ – పాకిస్తాన్ జట్లు 3 మ్యాచ్‌లలో ముఖాముఖి తలపడ్డాయి. అయితే పాకిస్తాన్‌తో భారత్ జట్టు తలపడటాన్ని కొంతమంది తప్పుబట్టినప్పటికీ.. బీసీసీఐ మాత్రం..దుబాయ్‌ వేదికగా అయితేనే పాక్‌ జట్టుతో క్రికెట్ ఆడతామని షరతు పెట్టి నెగ్గించుకుంది. ప్రపంచ క్రికెట్‌ను శాసించే స్థాయిలో ఉన్న బీసీసీఐతో తలపడితే.. ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టపోతామని భావించిన పీసీబీ కూడా భారత్ షరతుకు ఓకే చెప్పింది.

దుబాయ్ వేదికగా ఈ నెల 14వ తేదీ జరిగిన లీగ్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. కులదీప్ యాదవ్, బూమ్రా, అక్సర్ పటేల్ పాకిస్తాన్‌ను కట్టడి చేయగా.. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ రెచ్చిపోవడంతో.. మరో 4 ఓవర్లు ఉండగానే భారత జట్టు విజయం సాధించింది. ఆ తర్వాత సూపర్ 4 మ్యాచ్‌లో రెండోసారి తలపడిన మెన్ ఇన్ బ్లూ టీమ్.. 6 వికెట్ల తేడాతో దాయాది జట్టును మట్టికరిపించింది. 172 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే చేధించింది. అభిషేక్ శర్మ సూపర్ ఇన్నింగ్స్‌కు తిలక్ వర్మ దూకుడు తోడవ్వటంతో భారత్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.

Also Read : తెలంగాణా స్థానిక పోరు.. ఎన్నికల షెడ్యూల్ ఇదే..!

ఇక టైటిల్ పోరులో టీమిండియా ఆల్ రౌండ్ ప్రతిభతో రాణించింది. ఒక్క వికెట్ నష్టానికి 113 పరుగులు చేసి భారీ లక్ష్యం దిశగా వెళ్తున్న పాకిస్తాన్ జట్టును భారత్ బౌలర్లు కట్టడి చేశారు. 33 పరుగులకే 9 వికెట్లు తీసి 146 రన్స్‌కే పాకిస్తాన్‌ను ఆలౌట్ చేసింది. కులదీప్ యాదవ్ 4 వికెట్లు తీయగా.. బూమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్సర్ పటేల్ తలో 2 వికెట్లు తీశారు. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. సూపర్ ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ 5, శుభ్ మన్ గిల్ 12, సూర్యకుమార్ యాదవ్ సింగిల్ రన్ తీసి పెవిలియన్ చేరారు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో క్రీజ్‌లోకి వచ్చిన తెలుగు తేజం తిలక్ వర్మ.. సంజూ శాంసన్, శివమ్ దూబేతో కలిసి భారత్‌ స్కోరు బోర్డు ముందుకు తీసుకెళ్లారు. చివరి బంతి వరకు క్రీజ్‌లో ఉన్న తిలక్ వర్మ.. 53 బంతుల్లో 4 సిక్సర్లు, 3 బౌండరీలతో 69 పరుగులు చేసి.. భారత్‌ ఖాతాలో చిరస్మరణీయ విజయాన్ని చేర్చారు. గెలుపు ఖాయమనుకున్న పాక్ అభిమానుల ఆశలపై వర్మ నీళ్లు జల్లాడు. చిరకాల ప్రత్యర్థిపై గ్రాండ్ విక్టరీతో ఎక్కడైనా సరే.. గెలుపు భారత్‌దే అని మరోసారి రుజువు చేసింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

కందుకూరులో వైసీపీ ప్లాన్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సామాజిక వర్గాల మధ్య...

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

పోల్స్