ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నేడు పెట్టుబడులు, మౌలిక వసతులు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, గతంలో తాను చేసిన అభివృద్ధి గురించి వివరించారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు రవాణాలో 41 శాతం జరుగుతోంది.. వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉండటం చాలా ప్రయోజనమని వివరించారు. ప్రస్తుతం రోడ్లు, రైళ్లు, విమానాలు, జలాలు, పైప్‌లైన్ ద్వారా రవాణా.. పైప్‌లైన్ ద్వారా రవాణా చేస్తే కాలుష్యం కూడా ఉండదన్నారు.
Also Read : అమ్మవారి ఆలయ అధికారులపై విమర్శలు..!
లాజిస్టిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం.. మౌలిక వసతులు, విద్యుదుత్పత్తి, పరిశ్రమలకు ప్రత్యేక మ్యాప్ తయారుచేశామని తెలిపారు. పోర్టులు-హార్బర్ల మధ్య రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాం.. మా ప్రభుత్వంలో రోడ్ల నాణ్యత విషయంలో రాజీపడమని స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణ పనులను తరచుగా చేపట్టాలని సూచించారు. మలేషియాలో ఈస్ట్, వెస్ట్ కారిడార్‌లో 8 వరుసల రోడ్లు వేశారు. అప్పట్లో వాజ్‌పేయీతో మాట్లాడి నెల్లూరు-చెన్నై హైవేను తెచ్చాం.. దేశానికి మణిహారంగా గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్టు మారిందని పేర్కొన్నారు. స్థానిక భూములు, ట్రాఫిక్ పరిస్థితులు చూసి రోడ్లు వేస్తామని, హైవేల విషయంలో దేశంలో రెండో స్థానంలో ఉన్నామన్నారు.
Also Read : మొదటి రోజు సినిమా ఎవరు చూడమన్నారు..? తెలంగాణ హైకోర్టులో కీలక వాదనలు
హైవేల్లో రూ.లక్షన్నర కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని తెలిపారు. రైల్వే డబుల్ లైన్లను నాలుగు వరుసలుగా మార్చే అవకాశం ఉందన్నారు. రైల్వేలో హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లపై చర్చలు జరుగుతున్నాయి.. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై మధ్య హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు అందుబాటులోకి వచ్చాయని, మన రాష్ట్రంలో రైల్వేలో 145 రకాల పనులు జరుగుతున్నాయి.. మేం వచ్చిన వెంటనే విశాఖ రైల్వే జోన్ ప్రారంభించామన్నారు. నియోజకవర్గాల్లో జరిగే అభివృద్ధిపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలి.. లాజిస్టిక్స్‌పై రూ.రెండున్నర లక్షల కోట్లు ఖర్చు పెట్టే అవకాశం ఉందన్నారు. కార్గో రవాణాలో గుజరాత్ తర్వాత మనమే ఉన్నాం.. కొత్తగా వచ్చే నాలుగు పోర్టుల వల్ల కార్గో రవాణా పెరుగుతోందని తెలిపారు. పోర్టుల నిర్మాణంలో టార్గెట్‌లు పెట్టుకుని పనులు చేస్తున్నాం.. ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండిoగ్ సెంటర్లు కూడా వస్తున్నాయన్నారు. రవాణాకు ఇన్‌లాండ్ వాటర్ మార్గాలు ఉపయోగించుకుంటామన్నారు చంద్రబాబు.