ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు సభలో పలు ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వగా, జీరో హవర్ లో కాస్త ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అటు మండలిలో మంత్రి నారా లోకేష్ వర్సెస్ వైసీపీగా వాతావరణం ఆసక్తిని రేపింది. మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ తనను టార్గెట్ చేయగా లోకేష్ అందుకు సమాధానం ఘాటుగా ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్వాహకాలను లోకేష్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇటు శాసన సభలో కూడా మంత్రులు పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
Also Read : బెజవాడ బూడిదపై ప్రభుత్వం క్లారిటీ.. గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు..!
ఇదిలా ఉంచితే అసెంబ్లీ లాబీ సైతం నేడు సందడిగా కనపడింది. ఎమ్మెల్యే బాలకృష్ణ లాబీలో సందడి చేసారు. అఖండ-2 విడుదల ఎప్పుడని మంత్రులు, ఎమ్మెల్యేలు బాలయ్యను అడగగా.. బాలయ్య సమాధానం ఇచ్చారు. ఎల్లుండి తమ్ముడు పవన్ సినిమా విడుదలవుతోందని, అందరూ చూడాలని కోరారు. అఖండ-2 డిసెంబర్ 5న విడుదలవుతోందని అన్నారు. పాన్ ఇండియా సినిమాగా వివిధ భాషల్లో తీసుకొస్తున్నామని బాలయ్య పేర్కొన్నారు. హిందీ డబ్బింగ్ కూడా చాలా బాగా వచ్చిందని బోయపాటి శ్రీను అన్నారని తెలిపారు.
Also Read : అయ్యర్ కు ఏమైంది..? జట్టు నుంచి సడెన్ గా..!
అన్ని భాషల్లోనూ ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు బాలయ్య. ఎమ్మెల్యేలుగా నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేద్దామని బాలయ్య పిలుపునిచ్చారు. జిల్లాకు ప్రత్యేక నిధులు అడుగుదామని మంత్రి సవిత అడగగా.. రాష్ట్రమంతా సమాన అభివృద్ధి జరుగుతోందని బాలయ్య కామెంట్ చేసారు. కాగా బాలకృష్ణ సచివాలయంలో కూడా కలియ తిరిగారు. పలువురు మంత్రుల పేషీలకు వెళ్లి నియోజకవర్గానికి రావాల్సిన నిధులపై చర్చించారు.