Tuesday, October 21, 2025 11:31 PM
Tuesday, October 21, 2025 11:31 PM
roots

ఏపి అసెంబ్లీకి జగన్..?

జగన్ అసెంబ్లీకి రావాలనేది టీడీపీ నేతల డిమాండ్. అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం రద్దు చేస్తామనేది స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట. దీంతో జగన్ అసెంబ్లీకి వస్తారా.. రారా అనే విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై అటు వైసీపీ నేతలు కూడా సభ్యత్వం రద్దు చేస్తారేమో అని భయపడుతున్నారు. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన జగన్.. అసెంబ్లీకి వెళ్లే విషయంపై అత్యంత సన్నిహితులు, పార్టీ ముఖ్య నేతలతో సమాలోచనలు చేస్తున్నారు.

Also Read : జగన్ కోసం ఎందుకంత ఆత్రం..?

వర్క్ ఫ్రం బెంగళూరు అనే పేరు తెచ్చుకున్న జగన్.. వారంలో 3 రోజుల పాటు ఇప్పుడు తాడేపల్లిలో ఉంటున్నారు. ప్రతి మంగళవారం తాడేపల్లి వస్తున్న జగన్.. గురువారం సాయంత్రం తిరిగి బెంగళూరు వెళ్లిపోతున్నారు. దీంతో ఈసారి కూడా జగన్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చేది లేదని వైసీపీ నేతలంతా ఫిక్స్ అయిపోయారు. అయితే సడన్‌గా జగన్ షాక్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు.

ఈ నెల 25వ తేదీ గురువారం నాడు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రైవేటు కళాశాలలను పీపీపీ కింద కేటాయించడాన్ని జగన్ ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశాన్ని అసెంబ్లీ సాక్షిగా అందరికీ తెలియజేయాలనేది జగన్ భావన. మెడికల్ కాలేజీ అంశంపై ప్లకార్డులు ప్రదర్శించాలని వైసీపీ నేతలు సూచించినట్లు తెలుస్తోంది. అయితే అసెంబ్లీకి హాజరయ్యేది ఎలా అనే విషయంపై ప్లాన్ చేస్తున్నారు.

Also Read : కేసీఆర్ ప్లాన్ అమలు చేయనున్న జగన్..!

అసెంబ్లీ వరకు కారులో వెళ్లి.. అక్కడ నుంచి వైసీపీ సభ్యులతో కలిసి అసెంబ్లీ ప్రాంగణంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ లోపలికి వెళ్లాలా… లేక తాడేపల్లి ప్యాలెస్ నుంచి పాదయాత్ర చేసుకుంటూ వెళ్లాలా అని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెలగపూడి అసెంబ్లీ వరకు 16 కిలోమీటర్ల దూరం ఉంది. చంద్రబాబు క్యాంపు కార్యాలయం, కరకట్ట మీదుగా రాజధాని పరిధి గ్రామాల మీదుగా మార్గం ఉంది. ఇలా పాదయాత్ర చేస్తే.. పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొంటారనేది వైసీపీ నేతల మాట. అందుకే పాదయాత్ర ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

పైగా 25వ తేదీన అసెంబ్లీకి రావటం అనేది ఓ గేమ్ ప్లాన్ అంటున్నారు కూడా. అదే రోజున పవన్ కల్యాణ్ కొత్త సినిమా ఓజీ విడుదలవుతోంది. మరోవైపు అదే రోజు సాయంత్రం పున్నమి ఘాట్‌లో జరుగుతున్న విజయవాడ ఉత్సవ్‌ వేడుకలకు సీఎం హజరవుతున్నారు. ఈ రెండు విషయాలు పూర్తిగా డైవర్ట్ అవుతాయనేది వైసీపీ నేతల ఆలోచన. అందుకే సరిగ్గా అదే రోజున అసెంబ్లీకి వెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి వైసీపీ నేతల ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

పోల్స్