Monday, October 20, 2025 12:08 PM
Monday, October 20, 2025 12:08 PM
roots

బ్రేకింగ్: వైసీపీకి ఊహించని షాక్.. కాంగ్రెస్ లోకి ఎంపీ..?

వైసీపీ అధికారం కోల్పోవడం ఏమో గాని ఆ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ కార్యకర్తలను కంగారు పెడుతున్నాయి. నాయకత్వ లోపాలు ఓటమి తర్వాత ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధినేత వైఎస్ జగన్ కూడా పార్టీపై పెద్దగా ఫోకస్ చేయడం లేదనే విమర్శలు సైతం ఉన్నాయి. ఈ క్రమంలో పార్టీ నుంచి కీలక నేతలు ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారు. అగ్ర నాయకత్వం కూడా జగన్ కు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తోంది అనే కామెంట్స్ మరింత కలవరానికి గురి చేస్తున్నాయి.

Also Read : పులివెందులలో టీడీపీ బిగ్ స్టెప్..?

తాజాగా వైసీపీ పార్లమెంటరీ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే పార్టీని నలుగురు రాజ్యసభ సభ్యులు వీడిన సంగతి తెలిసిందే. త్వరలో మరికొందరు దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన వైసీపీ ఎంపీ మేడా రఘునథ్‌రెడ్డి.. ఆ పార్టీలో జాయిన్ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పై విమర్శలు చేసిన కొన్ని రోజులకే ఆ పార్టీ ఎంపీ.. కాంగ్రెస్ ను చీఫ్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read : మారన్ ను ముంచిన కూలీ.. లాభాలు కష్టమేనా..?

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు సమాచారం. ఈ నిర్ణయాన్ని ఎంపీలు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మొత్తం 11 మంది వైసీపీ సభ్యుల్లో ఇప్పటికే మోపిదేవి, బీద మస్తాన్‌రావు, ఆర్‌.క్రిష్ణయ్య, విజయసాయిరెడ్డి పార్టీని వీడారు. మిగిలిన ఏడుగురు పార్లమెంట్ సమావేశాలకు దూరంగా ఉన్నారు. అందులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. మిగిలిన ఆరుగురు ఎక్కడ ఉన్నారో కూడా పార్టీ అధిష్టానానికి సమాచారం లేదని వార్తలు వస్తున్నాయి. అవినాష్ రెడ్డిని వివేకా కేసులో అరెస్ట్ చేయవచ్చనే వార్తలు సైతం వస్తున్నాయి. ఇప్పుడు మేడా కూడా దూరం కావడంతో ఎంత మంది మిగులుతారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్