తన మాట వినని దేశాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. అమెరికాతో సన్నిహితంగా ఉండే భారత్ పై కూడా కఠిన ఆంక్షలు విధించారు ట్రంప్. రెండు దఫాలుగా 50 శాతం సుంకాలు విధించారు. అయితే ఇది క్రమంగా ఆమెరికాకు షాక్ ఇచ్చే సూచనలు కనపడుతున్నాయి. బ్రెజిల్ పై కూడా అత్యధికంగా 50% సుంకం విధించారు. దక్షిణాఫ్రికా 30% ఎదుర్కొంటోంది. చైనా ఇప్పటికే అమెరికాతో వాణిజ్య యుద్ధంలో రంగంలోకి దిగింది.
Also Read : వార్ 2 వరల్డ్ వైడ్ లెక్క ఇదే.. మరీ ఇంత దారుణమా..?
ఇదే సమయంలో రష్యా ఓ అవకాశం కోసం ఎదురు చూస్తోంది. మరిన్ని ఆంక్షలు విధిస్తే ఏం చేయాలో ఇప్పటికే ప్లాన్ చేసుకుంది. ఇక తన చర్యలతో ఆ దేశాలను కూటమిగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. తమ దేశ కరెన్సీకి బ్రిక్స్ ముప్పుగా మారే అవకాశం ఉందనే ఆందోళన కూడా ట్రంప్ ను వెంటాడుతోంది. ఈ క్రమంలో రష్యా, చైనాకు భారత్ క్రమంగా దగ్గర అవుతోంది. ఇప్పటి వరకు భారత్ పై కత్తులు నూరిన చైనా, ఇప్పుడు భారత్ మా ప్రత్యర్ధి కాదని స్పష్టం చేసింది.
ఇక రష్యా అయితే, భారత్ తో భారీ వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు సిద్దమవుతోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపిన కొన్ని రోజుల తర్వాత, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మూడు రోజుల పర్యటన కోసం మాస్కోకు వెళ్ళారు. గురువారం, జైశంకర్ రష్యన్ కంపెనీలు తమ ప్రత్యర్ధులతో వ్యాపారంలో పోటీ పదాలని కోరారు. 5 ఏళ్ళ క్రితం 3 బిలియన్ డాలర్లు ఉన్న వాణిజ్య ఒప్పందం, 2024-25లో 68 బిలియన్లకు పెరిగిందని, తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని, వాణిజ్య సంబంధాలు పెంచుకోవాలని కోరారు.
Also Read : అమెరికా వీసాకు కొత్త రూల్స్.. వీసా రావాలంటే కష్టమేనా..?
గత సంవత్సరం చైనా-రష్యా వాణిజ్యం రికార్డు స్థాయిలో 244.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. అటు చైనా – బ్రెజిల్ మధ్య కూడా భారీ వ్యాపార ఒప్పందాలు నడుస్తున్నాయి. ఇది క్రమంగా అమెరికా ఆధిపత్యానికి షాక్ తగిలే సంకేతాలు ఇస్తోంది. చైనా సోయాబీన్ దిగుమతుల్లో 70% బ్రెజిల్ నుండే వస్తున్నాయి. ఇటు చైనా – భారత్ వాణిజ్యం కూడా మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇక దక్షిణాఫ్రికా తన శ్వేతజాతి మైనారిటీ పట్ల వివక్ష చూపుతోందని ఆరోపించిన ట్రంప్, దక్షిణాఫ్రికాపై 30% సుంకం విధించారు. ఆ దేశం కూడా ఇప్పుడు చైనాకు దగ్గరవుతోంది. కాగా చైనా విదేశాంగ మంత్రితో, జైశంకర్ భేటీ అయి అక్కడి నుంచి రష్యా వెళ్ళారు.