సమాజానికి ఆదర్శంగా ఉండవలసిన రాజకీయ నాయకుల చేష్టలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొందరు పిచ్చి చేష్టలతో రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు కోర్ట్ జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో యువ నాయకుడు చేస్తున్న పని వివాదంగా మారింది. మలయాళం మహిళా నటి ఒకరు తాను పడుతున్న ఇబ్బందిపై మీడియా ముందుకు వచ్చి సంచలన కామెంట్స్ చేసారు. అతని వేధింపులను ఆమె బయటపెట్టారు.
Also Read : వార్ 2 వరల్డ్ వైడ్ లెక్క ఇదే.. మరీ ఇంత దారుణమా..?
ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన యువ నాయకుడు ఒకరు గత మూడు సంవత్సరాలుగా తనకు అభ్యంతరకరమైన సందేశాలు పంపుతున్నారని, తనను ఐదు ఫైవ్ స్టార్ హోటల్ కు పిలుస్తున్నాడని, ఎన్నో సార్లు తాను ఫిర్యాదు చేసినా సరే పార్టీ నాయకులు గాని, అధికారులు గాని చర్యలు తీసుకోలేదని మలయాళ నటి రిని జార్జ్ సంచలన కామెంట్స్ చేసారు. నిందితుడి పేరు లేదా అతని పార్టీ పేరును బయటపెట్టేందుకు ఆమె నిరాకరించారు. దీనిపై బిజెపి స్పందిస్తూ ఎమ్మెల్యే పేరు బయటపెట్టింది.
Also Read : కూన ఎపిసోడ్‌లో కులం రచ్చ..!
కేరళలోని బిజెపి నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మంకూటిల్ చర్యగా వ్యాఖ్యానించారు. పాలక్కాడ్ జిల్లాలో అతని ఆఫీస్ బయట నిరసనకు కూడా దిగింది. అతని పాత్రపై కాంగ్రెస్ అధిష్టానం నివేదిక అడిగినట్టు మలయాళ మీడియా వెల్లడించింది. రీనా ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో ఈ ఆరోపణలు చేసారు. సోషల్ మీడియా ద్వారా అతను తనకు పరిచయం అయ్యాడని, మూడేళ్ళ నుంచి అతను ఇబ్బంది పెడుతున్నాడని ఆమె వెల్లడించింది. పార్టీ సీనియర్ నాయకులకు ఫిర్యాదు చేసినా లాభం లేదని.. ఎవరికి అయినా ఫిర్యాదు చేసుకోవచ్చని అతను వార్నింగ్ ఇచ్చినట్టు రీనా బయటపెట్టింది. అతనికి పార్టీలో అనేక పదవులు కూడా ఇచ్చారని రీనా ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం లేదని, అందుకే ఫిర్యాదు చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది.